Second Hand Bike Loan 2026: రూ.10 వేల జీతంతో కూడా బైక్ లోన్? సెకండ్ హ్యాండ్ వాహనాలపై బ్యాంకుల ఆఫర్లు షాక్!

Second Hand Bike Loan 2026: రూ.10 వేల జీతంతో కూడా బైక్ లోన్? సెకండ్ హ్యాండ్ వాహనాలపై బ్యాంకుల ఆఫర్లు షాక్!
x

Second Hand Bike Loan 2026: రూ.10 వేల జీతంతో కూడా బైక్ లోన్? సెకండ్ హ్యాండ్ వాహనాలపై బ్యాంకుల ఆఫర్లు షాక్!

Highlights

కొత్త బైక్ ధరలు పెరగడంతో సెకండ్ హ్యాండ్ బైక్ లోన్లకు డిమాండ్ పెరిగింది. 2026లో తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్న టాప్ బ్యాంకులు ఇవే.

Second Hand Bike Loan 2026: కొత్త ద్విచక్ర వాహనాల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యులు సెకండ్ హ్యాండ్ బైక్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వాడిన బైక్‌ల కొనుగోలుకు ప్రత్యేక రుణాలను అందుబాటులోకి తెచ్చాయి. తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన అర్హత నిబంధనలతో ఈ లోన్లు అందిస్తున్నాయి.

2026లో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అలాగే NBFCలు సెకండ్ హ్యాండ్ బైక్‌లకు 70 శాతం నుంచి 95 శాతం వరకు ఫైనాన్సింగ్ అందిస్తున్నాయి. మిగిలిన మొత్తాన్ని డౌన్ పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోర్, స్థిరమైన ఆదాయం ఉన్నవారికి ఈ లోన్లు సులభంగా మంజూరు అవుతున్నాయి.

సాధారణంగా వాడిన బైక్ లోన్లపై వార్షిక వడ్డీ రేట్లు 10 శాతం నుంచి 18 శాతం వరకు ఉంటాయి. కొన్ని NBFCలు క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా 24 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. లోన్ కాలపరిమితి ఏడాది నుంచి గరిష్ఠంగా ఐదేళ్ల వరకు ఉంటుంది. బైక్ విలువను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ముత్తూట్ క్యాపిటల్, టీవీఎస్ క్రెడిట్ వంటి సంస్థలు సెకండ్ హ్యాండ్ బైక్ లోన్లను అందిస్తున్నాయి. వీటిలో కొన్ని బ్యాంకులు బైక్ ధరలో 100 శాతం వరకు రుణం కూడా ఇస్తున్నాయి.

లోన్ పొందాలంటే కనీసం 21 ఏళ్ల వయస్సు ఉండాలి. ఉద్యోగులు కనీసం ఏడాది నుంచి పనిచేస్తుండాలి. వ్యాపారులు అయితే రెండేళ్ల అనుభవం తప్పనిసరి. నెలవారీ ఆదాయం కనీసం రూ.10,000 నుంచి రూ.15,000 వరకు ఉండాలి. సిబిల్ స్కోర్ 700కు పైగా ఉంటే తక్కువ వడ్డీతో లోన్ మంజూరు అవుతుంది.

పాన్ కార్డు, ఆధార్, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బైక్‌కు సంబంధించిన ఆర్‌సీ, బీమా, వాల్యుయేషన్ రిపోర్ట్ వంటి డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories