SBI: ఎస్బీఐ శుభవార్త.. ఆ డిపాజిట్లపై భారీగా పెరిగిన వడ్డీరేట్లు..

SBI News SBI Hikes Fixed Deposit Interest Rates Check New FD Rates | SBI FD Updates
x

SBI: ఎస్బీఐ శుభవార్త.. ఆ డిపాజిట్లపై భారీగా పెరిగిన వడ్డీరేట్లు..

Highlights

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లని పెంచింది...

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లని పెంచింది. ఈ కొత్త రేట్లు మార్చి 10 నుంచి అమల్లోకి వచ్చాయి. రూ.2 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ 20 నుంచి 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఎఫ్‌డి రేటును ఒక సంవత్సరం నుంచి ౧౦ సంవత్సరాలకు 50 బేసిస్ పాయింట్లు పెంచారు. అంటే, ఇంతకుముందు 3.10 శాతం వడ్డీని పొందే FD ఇప్పుడు 3.60% పొందుతుంది. సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై వడ్డీని 3.60 శాతం నుంచి 4.10 శాతానికి పెంచారు. కొత్త రేట్లు రెండు రకాల ఎఫ్‌డిలపై వర్తిస్తాయి. అంటే కొత్త ఎఫ్‌డి చేసినా లేదా పాత ఎఫ్‌డిని పునరుద్ధరించినా కొత్త రేట్లు వర్తిస్తాయి.

* 7-14 రోజుల మెచ్యూరిటీ పీరియడ్​ ఉన్న డిపాజిట్లకు వడ్డీ రేటు 2.90 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్లకు ఇది 3.40 శాతంగా ఉంది.

* 15-29 రోజుల పీరియడ్​ ఉన్న ఎఫ్​డీలపై వడ్డీ రేటు 2.90 శాతం. సీనియర్ సిటిజన్లకు 3.40 శాతంగా నిర్ణయించింది బ్యాంక్.

* 30-45 రోజుల వ్యవధి ఉన్న ఎఫ్​డీలకు వడ్డీ రేటు 2.90 శాతం. సీనియర్​ సిటిజన్లకు అయితే ఇది 3.40 శాతం.

* 46-60 రోజుల పీరియడ్​ ఉన్న ఎఫ్​డీలపై వడ్డీ రేటు 3.90 శాతం. సీనియర్ సిటిజన్లకు 4.40 శాతంగా నిర్ణయించింది బ్యాంక్.

* 61-90 రోజుల వ్యవధి ఉన్న ఎఫ్​డీలకు వడ్డీ రేటు 3.90 శాతం. సీనియర్​ సిటిజన్లకు అయితే ఇది 4.40 శాతం.

* 91-120 రోజుల మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న ఎఫ్​డీలకు వడ్డీ రేటు 3.90 శాతం. సీనియర్​ సిటిజన్లకు అయితే ఇది 4.40 శాతం.

* 6 నెలల ఒక రోజు నుంచి 9 నెలల వరకు వ్యవధి ఉన్న ఎఫ్​డీకి వడ్డీ రేటు సాధారణ పౌరులకు 4.40 శాతం. సీనియర్ సిటినజ్లకు రూ.4.90 శాతం,

* 9 నెలల 1 రోజు నుంచి ఏడాది లోపు ఎఫ్​డీకి వడ్డీ రేటు 4.40 శాతం. సీనియర్ సిటినజ్లకు మాత్రం రూ.4.90 శాతం,

* ఏడాది వ్యవధి ఉన్న ఎఫ్​డీకి వడ్డీ రేటు 4.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.90 శాతం,

* ఏడాది ఒకరోజు నుంచి రెండేళ్ల వరకు కాల పరిమితి ఉన్న ఎఫ్​డీకి వడ్డీ రేటు 4.40 శాతం. సీనియర్ సిటిజన్లకు 4.90 శాతం.

* రెండేళ్ల ఒక రోజు నుంచి మూడేళ్ల వరకు వ్యవధి ఉన్న ఎఫ్​డీలకు వడ్డీ రేటు సాధారణ పౌరులకైతే 5.20 శాతం, సీనియర్ సిటిజన్లకైతే 5.70 శాతం.

* మూడేళ్ల ఒక రోజు నుంచి 5 ఏళ్ల వరకు కాలపరిమితి ఉన్న ఎఫ్​డీలకు 5.45 శాతం వడ్డీ ఇస్తోంది ఎస్​బీఐ. సీనియర్ సిటిజన్లకు ఇది 5.95 శాతం.

* 5 ఏళ్ల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల వ్యవధి ఉన్న ఫిక్స్​డ్​ డిపాజిట్లకు వడ్డీ రేటు 5.50 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్లకు 6.30 శాతంగా నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories