Rythu Bharosa: రైతు భరోసాకు అప్లయ్ చేసుకున్నారా? అయితే మీకో అదిరే అప్ డేట్

telangana rythu bharosa scheme reasons for delayed payments eligibility issues  for farmers to claim funds
x

 Rythu Bharosa: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వారందరికీ త్వరలోనే రైతు భరోసా..!!

Highlights

Rythu Bharosa: రైతు భరోసా స్కీముపై మరో కీలక అప్ డేట్ వచ్చింది. కొత్తగా పట్టాదార్ పాస్ బుక్ వచ్చి రైతు భరోసాకు దరఖాస్తు చేసుకున్న వారి బ్యాంక్...

Rythu Bharosa: రైతు భరోసా స్కీముపై మరో కీలక అప్ డేట్ వచ్చింది. కొత్తగా పట్టాదార్ పాస్ బుక్ వచ్చి రైతు భరోసాకు దరఖాస్తు చేసుకున్న వారి బ్యాంక్ అకౌంట్స్ ను పరిశీలిస్తున్నారు. వివరాలు సరిగ్గా ఉన్నవారి ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం నిధులను జమ చేయనున్నారు.

తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మరో శుభవార్త చెప్పింది. కొత్తగా పట్టాదారు పాస్ బుక్ వచ్చిన రైతుల అకౌంట్లో కూడా పంట పెట్టుబడి సాయం నిధులను జమ చేస్తామని తెలిపింది. ఆ దిశగా ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. ప్రస్తుతం అర్హత కలిగిన రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఇప్పటికే 3 ఎకరాలలోపు భూమి ఉన్న ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మిగతా రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు త్వరలోనే జమ చేయనున్నారు.

రైతు భరోసా స్కీమ్ కోసం గతంలో రైతు బంధు పొందిన రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తులు తీసుకోలేదు. అయితే కొత్తగా పట్టాదార్ పాస్ బుక్ లు వచ్చిన రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దాదాపు 3లక్షలకు పైగా రైతులు కొత్తగా దరఖాస్తు చేసినట్లు తెలిసింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయా లేదా అనే ఆందోళన పట్టాదారుల్లో ఉంది. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అకౌంట్లో కూడా డబ్బులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ తాజాగా వెల్లడించింది.

కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన 3 లక్షల మంది బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఆయా బ్యాంకుల నుంని క్లియరెన్స్ రాగానే అర్హులైన వారిని గుర్తించి పంట పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపింది. ఈ దఫాలోనే డబ్బులు జమ చేస్తామని పేర్కొంది. డీబీటీ పద్దతిలో రైతుల ఖాతాలో ఈ డబ్బులు జమ కానున్నాయి. రైతులు బ్యాంకులకు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఇక గతంలో రైతు బంధు వచ్చిన రైతులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ముందుగా ఎకరంలోపు ఉన్న రైతులకు పంట పెట్టుబడి కింద సాయం అందించింది. తక్కువ విస్తీర్ణంలో ఉన్న భూముల నుంచి మొదలు చేసి ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భూములకు నిధులను విడుదల చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories