ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రాబ్యాంక్ సహా ఆ 5 బ్యాంకులు లేనట్లే

ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రాబ్యాంక్ సహా ఆ 5 బ్యాంకులు లేనట్లే
x
Andhra Bank
Highlights

బ్యాంకుల విలీనానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఆంధ్రా బ్యాంక్ సహా మరి కొన్ని బ్యాంకులు కనుమరుగు కానున్నాయి.

బ్యాంకుల విలీనానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఆంధ్రా బ్యాంక్ సహా మరి కొన్ని బ్యాంకులు కనుమరుగు కానున్నాయి.ఆంధ్ర బ్యాంక్ తో పాటు మరో 5 బ్యాంకులు కూడా ఇక వేరే బ్యాంకుల్లో కలిసిపోతున్నాయి. దీంతో బ్యాంకుల సంఖ్య 10 నుంచి 4కు తగ్గుతుంది. దేశంలో పలు బ్యాంకులు విలీనం చేస్తున్నట్టు గతంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది.

సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లో విలీనం కానుంది. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో కలిసిపోనుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు విలీనం అవుతాయి. అలహాబాద్ బ్యాంక్ కూడా ఇండియన్ బ్యాంక్‌లో వీలినం అవుతుంది. ఏప్రిల్ 1 నుంచి విలీనమైన బ్యాంకుల మెయిన్ బ్యాంక్ బ్రాంచులుగా మారిపోతాయి. ఆంధ్రా బ్యాంక్ శాఖ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచులుగా మారనుంది. మిగిలిన బ్యాంకులు అన్నీ కూడా మెయిన్ బ్రాంచ్ గా పేరులో కొనసాగుతాయి.

ఈ బ్యాంకుల విలీనం తర్వాత దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏడు వుంటాయి. ప్రభుత్వ రంగ చిన్న బ్యాంకులు 5 మాత్రమే మిగులుతాయి. ఇప్పటికే ఎస్బిఐ తన అన్ని శాఖలను కూడా విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో అతిపెద్ద బ్యాంక్‌గా వుంది.బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వేతర బ్యాంకులుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంకులు కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories