Reliance: రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండగే.. త్వరలో భారీగా పెరగనున్న షేర్ ధర!

Reliance
x

Reliance: రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండగే.. త్వరలో భారీగా పెరగనున్న షేర్ ధర!

Highlights

Reliance: భారతదేశపు దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఇప్పుడు స్టాక్ మార్కెట్ నిపుణుల హాట్ ఫేవరెట్‌గా మారింది.

Reliance: భారతదేశపు దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఇప్పుడు స్టాక్ మార్కెట్ నిపుణుల హాట్ ఫేవరెట్‌గా మారింది. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ 'మోర్గాన్ స్టాన్లీ' రిలయన్స్ షేర్ల విషయంలో ఇన్వెస్టర్లకు ఒక కీలక సలహా ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఈ స్టాక్ ఏకంగా 28% లాభాలను అందుకోవచ్చని అంచనా వేస్తోంది. రిలయన్స్ కేవలం టెలికాం, రిటైల్ రంగాలకే పరిమితం కాకుండా.. ఇప్పుడు AI (కృత్రిమ మేధ) రంగంలోకి భారీగా అడుగుపెట్టడం ఇన్వెస్టర్లలో ఆశలు రేకెత్తిస్తోంది. AIలో రాబోయే ఏడేళ్లలో దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ముఖేష్ అంబానీ ఇటీవల ప్రకటించారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, క్లీన్ ఎనర్జీ సేవలపై రిలయన్స్ కంపెనీ చూపిస్తున్న శ్రద్ధ వల్ల బ్రోకరేజ్ సంస్థలు ఈ కంపెనీపై సానుకూలంగా ఉన్నాయి.

టార్గెట్ ప్రైస్ ఎంతంటే..

మోర్గాన్ స్టాన్లీ రిలయన్స్ షేర్‌ను తన 'టాప్ పిక్' జాబితాలో చేర్చింది. ప్రస్తుతం ఉన్న ధర నుంచి పెరిగి, షేర్ విలువ రూ.1,803కి చేరుకోవచ్చని అంచనా వేసింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి రిలయన్స్ షేర్ ధర సుమారు రూ.1419.10 వద్ద ఉంది. ఈ పెరుగుదల అంచనా నిజమైతే ఇన్వెస్టర్లకు భారీ లాభాలు వస్తాయి. గత ఐదేళ్లలో రిలయన్స్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు దాదాపు 37 శాతం రాబడిని అందించిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. గత ఏడాది కాలంలోనే ఈ షేర్ 15.55 శాతం వృద్ధిని సాధించింది. ప్రస్తుత మార్కెట్ విలువల ప్రకారం రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19.21 లక్షల కోట్లుగా ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద కంపెనీగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటోంది.

గమనిక: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories