Reliance Jio Bumper Offer: డేటా వాడండి.. తర్వాతే రీచార్జ్ చేయండి

Reliance Jio New Offer Pay Later Option for Emergency Data Balance and Pay Later Steps to Activate
x

జియో ఆఫర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Jio New Offer 2021: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ జియో నెట్వర్క్ తో వివిధ రకాలైన ఆఫర్స్ తో టెలికం రంగంలో తన వ్యాపార ఎత్తుగడలతో ప్రత్యర్థులకు సవాలు...

Jio New Offer 2021: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ జియో నెట్వర్క్ తో వివిధ రకాలైన ఆఫర్స్ తో టెలికం రంగంలో తన వ్యాపార ఎత్తుగడలతో ప్రత్యర్థులకు సవాలు విసురుతున్నారు. తాజాగా తమ జియో యూసర్ ల కోసం కొత్త ఆఫర్ ని కూడా ప్రకటించారు. ఒక రోజులో తమ రోజు వారి మొబైల్ డేటా వాడిన తర్వాత కూడా అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ డేటా పొందడానికి లోన్ ఆప్షన్ ని ప్రవేశపెట్టారు. అయితే ముందుగా ఈ లోన్ ఆప్షన్ లో భాగంగా మొదట మనం డేటా ని వాడిన తర్వాతే రీచార్జ్ చేసుకునే వీలు ని కల్పించారు. అయితే మధ్యవర్తిత్వ అప్లికేషను లని వాడి మోసపోవద్దని జియో అధికారిక అప్లికేషను నుండి రీచార్జ్ చేసుకోవాలని రిలయన్స్ జియో సంస్థ తెలిపింది. ఇక ఈ లోన్ లో భాగంగా రోజుకి 1 జీబి డేటా ని 11 రూపాయల ధరకు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ జియో రీచార్జ్ పొందడానికి ఈ విధంగా అనుసరించండి.

  • మొదటగా మై జియో ఆప్ లో "మెనూ" బటన్ కి వెళ్ళాలి
  • "ఎమర్జెన్సీ మొబైల్ డేటా లోన్" ని క్లిక్ చేయండి
  • "ప్రోసిడ్" క్లిక్ చేయండి
  • "గెట్ ఎమెర్జెన్సీ డేటా" ని క్లిక్ చేయండి
  • "ఆక్టివ్ నౌ" ని క్లిక్ చేయండి
  • వెంటనే మొబైల్ డేటా మీ ఫోన్ లో "ఆక్టివ్" అవుతుంది
Show Full Article
Print Article
Next Story
More Stories