
RBI Loans: రూపాయి గ్యారెంటీ లేకుండానే రూ. 20 లక్షల లోన్.. పూర్తి వివరాలు ఇవే!
RBI Loans: సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే మీ కల ఇక సాకారం కానుంది.
సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే మీ కల ఇక సాకారం కానుంది. పెట్టుబడి కోసం ఆస్తులను తాకట్టు పెట్టలేక ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారులకు, యువ పారిశ్రామికవేత్తలకు భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) అద్భుతమైన శుభవార్త చెప్పింది. ఎంఎస్‌ఎంఈ (MSME) రంగాన్ని పరుగులు పెట్టించే దిశగా పూచీకత్తు లేని రుణాల పరిమితిని భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు..
వ్యాపార విస్తరణకు నిధుల కొరత లేకుండా చూసేందుకు, ఎటువంటి షూరిటీ (Collateral) లేకుండా ఇచ్చే రుణ పరిమితిని ఆర్‌బీఐ రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. అంటే ఇప్పుడు మీరు మీ ఇంటి డాక్యుమెంట్లు లేదా బంగారం తాకట్టు పెట్టకుండానే బ్యాంకు నుంచి రూ.20 లక్షల వరకు అప్పు పొందే వెసులుబాటు ఉంది. ఇది చిన్న తరహా పరిశ్రమలకు, స్టార్టప్స్‌కు కొండంత అండగా నిలవనుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని పరపతి సమీక్షా కమిటీ రెపో రేటును 5.25% వద్దే స్థిరంగా ఉంచాలని నిర్ణయించింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటంతో వడ్డీ రేట్లు పెంచకూడదని భావించింది. దీనివల్ల ఇల్లు, కారు కొనుగోలు చేసిన వారికి ఈఎంఐలు పెరిగే ముప్పు తప్పింది.
బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కాగితపు పనిని తగ్గించేందుకు ఆర్‌బీఐ సరికొత్త సంస్కరణలు చేపట్టింది..
కిసాన్ క్రెడిట్ కార్డులు (KCC): రైతులకు, చిన్న వ్యాపారులకు రుణాలను మరింత సులభంగా అందించేలా మార్గదర్శకాలను సవరించనున్నారు.
ఏకీకృత రిపోర్టింగ్ పోర్టల్: బ్యాంకులు, కస్టమర్ల మధ్య సమన్వయం కోసం డిజిటల్ పోర్టల్‌ను తీసుకురానున్నారు. దీనివల్ల లోన్ అప్లికేషన్లు వెంటనే ప్రాసెస్ అవుతాయి.
ఎన్‌బీఎఫ్‌సీలకు స్వేచ్ఛ: చిన్న ఫైనాన్స్ కంపెనీలు ఇకపై కొత్త శాఖలు తెరవడానికి అనుమతుల కోసం వేచి చూడాల్సిన పనిలేదు.
రియల్ ఎస్టేట్, ఐటీ రంగానికి ఊతం..
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లకు (REITs) బ్యాంకుల నుంచి నేరుగా రుణాలు ఇచ్చేలా నిబంధనలు మార్చారు. ఇది నిర్మాణ రంగంలో కొత్త ప్రాజెక్టులకు నిధుల ప్రవాహాన్ని పెంచుతుంది. ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉందని, ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ భారత్ దూసుకెళ్తోందని ఆర్‌బీఐ ధీమా వ్యక్తం చేసింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




