Ration Card: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఇలా చేయకుంటే రద్దయ్యే ఛాన్స్.. హెచ్చరించిన ప్రభుత్వం..!

Ration Card E Kyc Completed By 31 January 2024 otherwise Ration Card Cancelled says Telangana Govt
x

Ration Card: రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఇలా చేయకుంటే రద్దయ్యే ఛాన్స్.. హెచ్చరించిన ప్రభుత్వం..!

Highlights

శవ్యాప్తంగా పేదలకు రేషన్ కార్డుల ద్వారా సబ్సిడీని కేంద్రప్రభుత్వం అందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన' పథకంతో దేశ వ్యాప్తంగా ఉచితంగా రేషన్ ఇస్తోంది.

Ration Card: దేశవ్యాప్తంగా పేదలకు రేషన్ కార్డుల ద్వారా సబ్సిడీని కేంద్రప్రభుత్వం అందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన' పథకంతో దేశ వ్యాప్తంగా ఉచితంగా రేషన్ ఇస్తోంది. అయితే, ఈ క్రమంలో రేషన్ కార్డుల ఈ కేవైసీని ప్రభుత్వం చేపడుతోంది. అయితే, ప్రభుత్వం అందించే సబ్సిడీతో రేషన్‌తో పాటు సంక్షేమ పథకాలు పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందే. ఈ క్రమంలో బోగస్ కార్డులను గుర్తించి, రద్దు చేసేందుకు కేంద్రం నడుం బిగించింది. ఈ మేరకు ఆధార్ నంబర్‌తో లింక్ (ఈ కేవైసీ) చేయాలని కోరింది. రేషన్ కార్డుతో ఆధార్ నంబర్ లింక్ చేసేందుకు ఇప్పటికే ఎన్నోసార్లు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆ గడవును జనవరి 31, 2024 వరకు పొడగించినట్లు ప్రభుత్వం ప్రకటిచింది.

ఇక, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులను జనవరి 31 లోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేవైసీ పూర్తి చేయకుంటే మాత్రం రేషన్ కార్డ్ రద్దు అవుతుందని తెలిపారు.

గత రెండు నెలలుగా..

గత రెండు నెలలుగా రేషన్ దుకాణాల్లో ఈ-కేవైసీ ప్రక్రియను చేపడుతున్నారు. రేషన్ కార్డ్ ఈకేవైసీ కోసం ఆధార్‌ ధ్రువీకరణ, వేలిముద్రలను తీసుకుంటున్నారు. ఆధార్ లింక్ చేయకుంటే, వెంటనే ఈకేవైసీ త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ఈకేవైసీ చేయకుంటే కార్డు రద్దు..

రేషన్ కార్డును ఆధార్ నంబర్‌తో ఈకేవైసీ చేసేందుకు రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరి ఆధార్ కార్డ్ నంబర్లు అందించాల్సి ఉంటుంది. కాగా, రేషన్ కార్డుదారులంతా త్వరగా ఈకేవైసీ పూర్తి చేయాలని సూచించింది. లేదంటే, నకిలీవిగా భావించి, మీ రేషన్ కార్డ్‌లను తొలగిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 30 నాటికి 70.80 శాతం ఈకేవీసీ పూర్తయినట్లు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. ఈకేవైసీలో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా (87.81 శాతం) అగ్రస్థానం ఉన్నట్లు ఆయన తెలిపారు. అలాగే, వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 54.17 శాతం పూర్తయినట్లు ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories