logo

ఇప్పుడు ఐఫోన్ XR ధర తక్కువే.. 10 శాతం ఆఫర్ కూడా..

ఇప్పుడు ఐఫోన్ XR ధర తక్కువే.. 10 శాతం ఆఫర్ కూడా..
Highlights

జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఈఫోన్ వాడాలని ప్రతి ఒక్కరికి ఉన్నా ధరలు...

జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్ వాడాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఈఫోన్ వాడాలని ప్రతి ఒక్కరికి ఉన్నా ధరలు మాత్రం కొందరికే అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా ఐఫోన్ ప్రియుల కోసం ఐఫోన్ XR ధరను తగ్గించింది యాపిల్ కంపెనీ. దీని ధర అసలు ధర 64GB రూ. 76,900 ఉండగా రూ. 17,011 తక్షణ తగ్గింపు తోపాటు hdfc క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది. దీంతో ఈ ఫోన్ ఆఫర్ కింద 53,900 లకే అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ ఎంపిక చేసిన కొన్ని యాపిల్ స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే కొన్ని కండీషన్స్ కూడా ఉన్నాయి.

ఇక ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే..

*6.1-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్ప్లే,

*IP67 నీరు మరియు ధూళి నిరోధకత (గరిష్ట లోతు 1 మీటరు వరకు 30 నిమిషాలు),

*OIS తో 12-మెగాపిక్సెల్ కెమెరా మరియు 7-మెగాపిక్సెల్ TrueDepth ఫ్రెంట్ కెమెరా, పోర్ట్రైట్ మోడ్, పోర్ట్రైట్ లైటింగ్, డెప్త్ కంట్రోల్ మరియు స్మార్ట్ HDR , పేస్ఐడి సెక్యూర్ అతేంటికేషన్

*వైర్లెస్ ఛార్జింగ్ - Qi ఛార్జర్లతో పనిచేస్తుంది,

*iOS 12 మెమోజి, స్క్రీన్ టైమ్, సిరి షార్ట్కట్స్

లైవ్ టీవి

Share it
Top