దిగివస్తున్న విలువైన లోహాల ధరలు..

దిగివస్తున్న విలువైన లోహాల ధరలు..
x
Highlights

విలువైన లోహాల ధరలు మరోమారు దిగివచ్చాయి. ప్రపంచ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్ లోనూ బంగారం, వెండి రేట్లు దిగివస్తున్నాయి.

విలువైన లోహాల ధరలు మరోమారు దిగివచ్చాయి. ప్రపంచ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్ లోనూ బంగారం, వెండి రేట్లు దిగివస్తున్నాయి. దేశీ విపణి మల్టీ కమోడిటీ ఎక్సేంజీ ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.2 శాతం మేర దిగిరాగా..మరో విలువైన లోహం వెండి 0.5 శాతం పడిపోయింది హైదరాబాద్ స్పాట్ మార్కెట్ లో పది గ్రాముల పసిడి ధర 52,670 రూపాయలుగా నమోదయింది..ఇక దేశంలోని మెట్రో నగరాల్లో ఇంధన ధరలు వరుసగా 26 వరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. రాజధాని ఢిల్లీలో డీజిల్ రేటు లీటరుకు 70.46 వద్ద స్థిరంగా ఉండగా..పెట్రోల్ రేటు లీటరుకు 81.06 వద్ద యధాతధంగా కొనసాగుతోంది..హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 84 రూపాయల 25 పైసలు వద్దకు చేరగా.. డీజిల్ ధర లీటర్‌కు 76 రూపాయల 84 పైసలుగా నమోదయింది...

Show Full Article
Print Article
Next Story
More Stories