Pension Plan: వారికి అద్భుత అవకాశం.. నెలకి రూ.18,500 పెన్షన్..!

pradhan mantri vaya vandana yojana scheme check for all details
x

Pension Plan: వారికి అద్భుత అవకాశం.. నెలకి రూ.18,500 పెన్షన్..!

Highlights

Pension Plan: మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలంటే మార్చి 31, 2023 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

Pension Plan: ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 26 మే 2020న ప్రారంభించింది. ఇది సామాజిక భద్రత పథకం. ఇందులో లబ్ధిదారునికి నెలవారీ పెన్షన్ లభిస్తుంది. దీనిని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నిర్వహిస్తోంది. భార్యాభర్తలిద్దరూ 60 ఏళ్లు దాటితే గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇంతకుముందు పెట్టుబడి పరిమితి రూ. 7.5 లక్షలుగా ఉండేది. ఇప్పుడు అది రెట్టింపు అయింది. మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలంటే మార్చి 31, 2023 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

రూ.15 లక్షల పెట్టుబడిపై నెలకు రూ.9,250 పెన్షన్

60 ఏళ్లు పైబడిన పౌరులందరూ ఈ ప్రత్యేక పథకంలో రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో పెట్టుబడిని బట్టి ప్రతినెలా రూ.1000 నుంచి రూ.9250 వరకు పెన్షన్ లభిస్తుంది. కనిష్టంగా రూ.1.50 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.1000 పెన్షన్, రూ.15 లక్షల పెట్టుబడికి నెలకు రూ.9,250 పెన్షన్ వస్తుంది. భార్యాభర్తలు ఈ పథకంలో రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టాలి ఆపై ఇద్దరికీ కలిపి ప్రతి నెలా రూ.18,500 పెన్షన్ లభిస్తుంది.

10 సంవత్సరాలలో..

ఈ స్కీమ్‌లో 10 సంవత్సరాలలో పూర్తి మొత్తాన్ని తిరిగి పొందుతారు. ఇది కాకుండా డిపాజిట్ చేసిన డబ్బుపై నెలవారీ పెన్షన్ కొనసాగుతుంది. ఈ పథకం అతి పెద్ద లక్షణం ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత పెట్టిన పెట్టుబడి డబ్బును తిరిగి పొందడమే. అంతేకాదు మీరు ఎప్పుడైనా ఈ పథకాన్ని సరెండర్ చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories