Pension: నెలకు రూ.55 చెల్లిస్తే రూ. 3 వేల పెన్షన్ కావాలా?: ఇలా చేయండి

Pradhan Mantri Shram Yogi Maandhan Offers Rs 3000 Monthly Pension
x

Pension: నెలకు రూ.55 చెల్లిస్తే రూ. 3 వేల పెన్షన్ కావాలా?: ఇలా చేయండి

Highlights

PM Shram Yogi Mandhan Yojana: మీకు నెలకు 3 వేల పెన్షన్ కావాలా? ఆధార్ కార్డ్, ఈ శ్రమ్ కార్డు ఉంటే చాలు... నెల నెల మీ బ్యాంకు ఖాతాల్లో 3 వేలు జమ అవుతాయి.

PM Shram Yogi Mandhan Yojana: మీకు నెలకు 3 వేల పెన్షన్ కావాలా? ఆధార్ కార్డ్, ఈ శ్రమ్ కార్డు ఉంటే చాలు... నెల నెల మీ బ్యాంకు ఖాతాల్లో 3 వేలు జమ అవుతాయి. అయితే ఈ స్కీమ్ కు ఎవరు అర్హులు? ఎలా అప్లయ్ చేసుకోవాలా తెలుసుకుందాం.

ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అసంఘటిత రంగంలో పనిచేసే వారికి సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తెచ్చింది. 2019 నుంచి ఈ పథకం అమల్లో ఉంది. ఈ పెన్షన్ స్కీమ్ లో 50:50 నిష్పత్తిలో చందాదారుడు ఎంత జమ చేస్తే కేంద్ర ప్రభుత్వం అంతే మొత్తంలో జమ చేస్తోంది. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 3 వేల పెన్షన్ ఉంటుంది.

ఈ స్కీమ్ కింద చేరాలంటే 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వయస్సుండాలి. నెల జీతం 15 వేలకు తక్కువగా ఉండాలి. ఈ శ్రమ్ కార్డు కచ్చితంగా ఉండాలి. ఈపీఎఫ్ఓ ఎన్ పీ ఎస్, ఈఎస్ఐసీ లో సభ్యులుగా ఉంటే ఈ పథకంలో చేరడానికి అర్హత ఉండదు.

ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి ఎల్ఐసీ లేదా కామన్ సర్వీస్ సెంటర్స్ లేదా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద కు https: maandhan.in వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో మీ ఆధార్ నెంబర్, ఈ శ్రమ్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడీ, అడ్రస్ సమగ్రంగా ఇవ్వాలి. అంతేకాదు బ్యాంకు ఖాతా, నామినీ వివరాలు కూడా అందించాలి. వయస్సు ఆధారంగా ఎంత ప్రీమియం చెల్లించాలో వెబ్ సైట్ చెబుతోంది. దాని ఆధారంగా డబ్బులు చెల్లించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories