Investment: ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడితే ఏటా 13200 రూపాయలు..!

Post Office MIS Scheme Once invested in this scheme 13200 rupees per year
x

Post Office MIS Scheme Once invested in this scheme 13200 rupees per year

Highlights

Investment: ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడితే ఏటా 13200 రూపాయలు..!

Investment: పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం ఒక గొప్ప పొదుపు పథకం. ఇందులో ఒక్కసారి డిపాజిట్‌ చేస్తే ప్రతి నెలా గ్యారెంటీ ఆదాయం వస్తుంది. మార్కెట్ అస్థిరత ఈ పథకంలో చేసిన పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపదు. ఇందులో మీ డబ్బు పూర్తిగా సురక్షితం. మీరు MIS ఖాతాలో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి. దీని మెచ్యూరిటీ 5 సంవత్సరాలు. అంటే ఐదేళ్ల తర్వాత మీరు హామీతో కూడిన నెలవారీ ఆదాయాన్ని పొందడం ప్రారంభిస్తారు.

MIS కాలిక్యులేటర్ ప్రకారం ఒక వ్యక్తి రూ. 2 లక్షల ఏకమొత్తం డిపాజిట్‌తో ఈ ఖాతాను తెరిస్తే మెచ్యూరిటీ తర్వాత అతను వచ్చే ఐదేళ్లకు ఏటా రూ.13,200 ఆదాయం పొందుతాడు. అంటే ప్రతి నెలా రూ.1100 అందుతుంది. ఈ విధంగా మీరు ఐదేళ్లలో మొత్తం రూ.66,000 వడ్డీని పొందుతారు. పోస్ట్ ఆఫీస్ MIS ప్రస్తుతం 6.6% వార్షిక వడ్డీని అందిస్తుంది. ఈ పథకంలో కనీసం రూ. 1,000 పెట్టుబడితో ఖాతాను తెరవవచ్చు. సింగిల్, జాయింట్ అకౌంట్ రెండూ ఓపెన్‌ చేయవచ్చు.

మీరు ఒకే ఖాతాలో గరిష్టంగా రూ. 4.5 లక్షలు, ఉమ్మడి ఖాతాలో రూ. 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. MISలో ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తారు. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో భారతీయ పౌరులెవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత మాత్రమే మీరు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు MIS ఖాతాను ఒక పోస్టాఫీసు నుంచి మరొక పోస్టాఫీసుకు బదిలీ చేయవచ్చు. మెచ్యూరిటీ అంటే ఐదేళ్లు పూర్తయిన తర్వాత దానిని మరో 5-5 ఏళ్లకు పొడిగించవచ్చు. MIS ఖాతాలో నామినేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ పథకంలో డబ్బు పూర్తిగా సురక్షితం.

Show Full Article
Print Article
Next Story
More Stories