రూ. 20 కడితే రు.2లక్షల ప్రమాద బీమా.. కొత్త పథకాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం


PMSBY: భారత ప్రభుత్వం అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని మరో పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది. వారి భవిష్యత్తుకి భరోసాను ఇచ్చే ప్రధాన మంత్రి బీమా సురక్ష యోజన(PMBSY) స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.
PMSBY: భారత ప్రభుత్వం అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని మరో పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది. వారి భవిష్యత్తుకి భరోసాను ఇచ్చే ప్రధాన మంత్రి బీమా సురక్ష యోజన(PMBSY) స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఇదొక లోకాస్ట్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఏడాడికి కేవలం రు. 20 లు ప్రీమియం కడితే చాలు 2 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. చాలామంది నిరుపేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ప్రీమియం ఉన్న పథకాలు తీసుకోలేక, సరైన వైద్యం అందక చనిపోతున్నారు. ఇది దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ స్కీమ్ ను తీసుకొచ్చింది.
అయితే ఇలాంటి ఇన్సూరెన్స్ లు ప్రభుత్వం గతంలో ఏమీ తీసుకురాలేదా అంటే తీసుకొచ్చింది. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రదాన మంత్రి బీమా సురక్ష యోజన పథకం ద్వారా ప్రమాదవ శాత్తు మృతిచెందిన లేదా గాయపడ్డవారికి ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకాన్ని లక్షలాది మంది ఉపయోగించుకుంటున్నారు. ఈ ఇన్సూరెన్స్ లో ఎలాంటి హాస్పిటల్ ఖర్చులు ఉండవు.
ఈ కొత్త ప్రధాన మంత్రి బీమా సురక్ష యోజన(PMSBY) స్కీమ్ కూడా పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు చాలా బాగా ఉపయోగపడనుంది. ఈ పాలసీ గురించి ఇంకా క్లియర్ గా చెప్పాలంటే పాలసీదారుడు ప్రమాదంలో మరణిస్తే వారి నామినీకి రు. 2లక్షలు అందుతాయి. అంతేకాదు ఈప్రమాదం కారణంగా ఏదైనా వైకల్యం వచ్చినా కూడా రు. 2 లక్షలు అందుతాయి. అయితే ఇందులో రెండు రకాలున్నాయి. అందులో మొదటిది ఏంటంటే పాలసీదారుడు చిన్న వైకల్యానికి గురైతే లక్ష రూపాయలు మాత్రమే ఇస్తారు. అంటే పాలసీదారుడు ప్రమాదానికి గురైనప్పుడు రెండు కళ్లు పోయినా, రెండు చేతులు పోయినా, రెండు కాళ్లు పోయినా అది శాశ్వత వైకల్యంగా గుర్తిస్తారు. దానికి 2 లక్షల రూపాయలు ఇస్తారు. అదే ఒక చెయ్యి, ఒక కాలు, ఒక కన్ను ఇలాగనక జరిగితే ఒక లక్ష రూపాయలు మాత్రమే ఇస్తారు. అయితే ఈ లక్ష, రెండు లక్షల రూపాయలు ఆ సమయంలో పాలసీదారులకు చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ పథకానికి 18 నండి 70 సంవత్సరాల వయసు ఉన్న భారత పౌరులు అప్లై చేసుకోవచ్చు. ప్రీమియం ఏటా ఆటోమేటిక్ గా డెబిట్ అవుతుంది. అయితే దీనికోసం ఒక బ్యాంక్ అకౌంట్ అవసరం పడుతుంది. అలాగే బీమా కవర్ ప్రతి ఏడాది జూన్ 1 నుంచి మే 31 వరకు నడుస్తుంది.
ఈ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ అనేది ఏదైనా ప్రమావశాత్తు సంభవించే గయాలైన లేదా మరణం జరిగిన వాటి నుండి ఆర్ధికంగా రక్షిస్తుంది. ఆ సమయంలో హాస్పిటల్ ఖర్చులను ఈ బీమానే భరిస్తుంది. ఉదాహరణ ఎవరైనా గాయపడితే ప్రమాద బీమా అసుపత్రి బిల్లులు, వైద్య పరీక్షలు, చికిత్స ఖర్చులను కవర్ చేస్తుంది. ఒకవేళ అతను శాశ్వతంగా వైకల్యానికి గురైతే బీమా ఆ వైకల్యం కారణంగా వచ్చే ఆదాయ నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. ఇక వ్యక్తి మరణిస్తే గనక ఆ బీమాలో ఉన్న నామినీకి ఆ డబ్బులు అందుతాయి.
- Pradhan Mantri Suraksha Bima Yojana 2025
- PMSBY benefits and coverage
- low cost accident insurance India
- Rs 20 insurance scheme India
- accident insurance policy for poor and middle class
- PMSBY eligibility and premium
- how to apply PMSBY online
- PMSBY claim process and coverage
- government accident insurance scheme India
- PMSBY nominee benefits

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



