PM Kisan: వారి స్థానంలో కొత్త రైతుల పేర్లు.. మూడు నెలల్లో తిరిగి చెల్లించాల్సిందే..!

PM Kisan update pm kisan samman nidhi amount to recover from 3 lac farmers | Live News
x

PM Kisan: వారి స్థానంలో కొత్త రైతుల పేర్లు.. మూడు నెలల్లో తిరిగి చెల్లించాల్సిందే..!

Highlights

PM Kisan: పీఎం కిసాన్ నిధి లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురుచూస్తున్నారు...

PM Kisan: పీఎం కిసాన్ నిధి లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. మే, జూలై మధ్యలో 2000 రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. దీని కోసం ప్రభుత్వం e-KYC నిర్వహణకు మే 31 చివరి తేదీని నిర్ణయించింది. ఇప్పుడు పీఎం కిసాన్‌లో లబ్ధిదారులలో అనేక మంది అనర్హులు ఉన్నారు. వారు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 3 లక్షల మంది అనర్హులు తెరపైకి వచ్చారు.

చనిపోయిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు

పీఎం కిసాన్ లబ్ధి పొందుతున్న వారిలో ఆదాయపు పన్ను చెల్లించే రైతులు కూడా ఉన్నారు. దీంతో పాటు చనిపోయిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. అలాంటి రైతుల నుంచి వాయిదాల చెల్లింపునకు ప్రభుత్వం మూడు నెలల గడువు కేటాయించింది. ఈలోగా వారు డబ్బులు చెల్లించాలి. అనర్హులైన రైతుల నుంచి 3 నెలల్లో డబ్బులు రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాబితా నుంచి అనర్హుల పేర్లను తొలగించి చనిపోయిన రైతుల స్థానంలో కొత్త రైతులను చేర్చాలని సూచించారు.

ప్రభుత్వం ఇ-కెవైసిని నిర్వహించడానికి చివరి తేదీని మే 31గా నిర్ణయించింది. ఇప్పుడు మీరు మీ మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి కూడా e-KYC చేయవచ్చు. ఇంతకుముందు ఈ సదుపాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతుల ఖాతాలకు సంవత్సరానికి రూ.6000 జమ చేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో అమలు చేసింది. ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా 6000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమవుతాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 12.5 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories