PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 14వ విడత సాయంపై కీలక అప్‌డేట్...!

PM Kisan Samman Nidhi 14th Installment Latest Update rs 2000 Credited on this Date
x

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 14వ విడత సాయంపై కీలక అప్‌డేట్..

Highlights

PM Kisan 14th Installment: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడత ఏప్రిల్, జులై మధ్య విడుదల కానుంది. గత సంవత్సరం, ఇదే కాలంలో అందుకున్న 11వ వాయిదా 31 మే 2022కి బదిలీ చేశారు. అయితే ఈసారి త్వరలో 14వ విడత ఖాతాలో చేరే అవకాశం ఉంది.

PM Kisan 14th Installment: దేశంలోని 12 కోట్ల మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. అంతకుముందు 13వ విడతను ప్రభుత్వం ఫిబ్రవరి 27న రైతుల ఖాతాలో జమ చేసింది. అప్పట్లో 8.42 కోట్ల మంది రైతులకు 13వ విడత డబ్బులు అందజేశారు. ఇన్ స్టాల్ మెంట్ వచ్చి దాదాపు రెండు నెలల తర్వాత 14వ విడతకు సంబంధించి పెద్ద అప్ డేట్ రాబోతోంది. ఈ పథకం కింద రైతులకు 14వ విడతగా రూ.2 వేలు, ఏటా రూ.6 వేలు అందజేస్తారు.

14వ విడత త్వరలో వచ్చే అవకాశం..

షెడ్యూల్ ప్రకారం, PM కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడత ఏప్రిల్, జులై మధ్య విడుదల కానుంది. గత సంవత్సరం ఇదే కాలంలో అందుకున్న 11వ వాయిదా 31 మే 2022కి బదిలీ చేశారు. అయితే ఈసారి త్వరలో 14వ విడత ఖాతాలో చేరే అవకాశం ఉంది. ఈసారి మే 15 నాటికి ప్రభుత్వం రైతుల ఖాతాలకు వాయిదాల సొమ్మును పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆర్థికంగా సాయం చేస్తాం..

ఈసారి అకాల వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోయారని, ఈసారి వాయిదా డబ్బులు త్వరగా వస్తాయని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సకాలంలో డబ్బులు వస్తే రైతులకు ఆర్థిక సాయం అందుతుంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

ఎలా నమోదు చేసుకోవాలి..

ఈ స్కీమ్‌కు అర్హత కలిగి ఉండి, మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటే, మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం, మీరు ఆ ప్రాంతానికి చెందిన తహసీల్దార్ లేదా PM కిసాన్ యోజన కోసం ఎంపిక చేసిన నోడల్ అధికారిని సంప్రదించాలి. సంబంధిత ఫారమ్‌ను ఇక్కడ పూరించడం ద్వారా మీ పత్రాలను సమర్పించండి. మీరు మీ సమీప పబ్లిక్ సర్వీస్ సెంటర్ (CSC)ని కూడా సంప్రదించవచ్చుసంప్రదించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories