PM Jan Dhan Yojana: జన్ ధన్ ఖాతాతారులు మరణిస్తే.. ఖాతాల్లోకి లక్షల డబ్బులు వస్తాయా?

PM Jan Dhan Yojana
x

PM Jan Dhan Yojana: జన్ ధన్ ఖాతాతారులు మరణిస్తే.. ఖాతాల్లోకి లక్షల డబ్బులు వస్తాయా?

Highlights

PM Jan Dhan Yojana: దేశంలో మోదీ సర్కార్ చాలా పథకాలను తీసుకొస్తూనే ఉంది. పేదలు, మహిళలు ఆర్ధికంగా ఎదిగేందుకు రకరకాల పథకాలను అమలు చేస్తుంది.

PM Jan Dhan Yojana: దేశంలో మోదీ సర్కార్ చాలా పథకాలను తీసుకొస్తూనే ఉంది. పేదలు, మహిళలు ఆర్ధికంగా ఎదిగేందుకు రకరకాల పథకాలను అమలు చేస్తుంది. అయితే ఈ పథకాల సంగతి ఇంకా ఇప్పటికీ చాలామందికి తెలియదు. అలాగే, జన్ థన్ పథకం ప్రకారం ఖాతాదారులు చనిపోతే లక్షల రూపాయలు లబ్ధిదారులకు వస్తాయన్న సంగతి కూడా చాలా మందికి తెలీదు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో ప్రతి వ్యక్తి డబ్బును సురక్షితంగా ఉంచడానికి, వారికి భద్రతా కవరేజ్‌ను ఇవ్వడానికి 11 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ప్రమాద బీమా మొత్తం అందడం లేదు. 2014 ఆగష్టు 28న ప్రభుత్వ పిలుపు మేరకు కోట్లాది మంది బ్యాంకుల్లో జన్ ధన్ ఖాతాలను తెరిచారు. ఈ పథకం కింద ఖాతాదారులకు రూ. లక్ష ప్రమాద బీమా హామీ ఇచ్చింది.

అయితే, ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు సిద్దమవుతోంది. 2018 ఆగష్టు 28 నుండి తెరిచిన ఖాతాలపై ప్రమాద బీమా రెండు లక్షలకు పెంచింది. కానీ బ్యాంకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు 875 మందికి మాత్రమే బీమా మొత్తం అందినట్లు తెలుస్తోంది. అంతేకాదు బ్యాంకులు ఈ భీమా గురించి ఖాతాదారులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అదేవిధంగా ఖాతాను ఎలా నిర్వహించాలన్న విషయాన్ని చెప్పలేదు.

ఈ పథకం కింద దేశంలో ఇప్పటివరకు 53.13 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు తెరిచారు. వీటిలో రూ.2,31,236 కోట్లు జమ అయ్యాయి. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ 53.13 కోట్ల ఖాతాలలో 66.6 శాతం అంటే 35.37 కోట్లకు పైగా ఖాతాలు గ్రామీణ సెమీ అర్భన్ ప్రాంతాలలో మాత్రమే తెరిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories