Rs.500 Note : త్వరలో రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

Rs.500 Note
x

Rs.500Note : త్వరలో రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

Highlights

Rs.500 Note : రెండు సంవత్సరాల క్రితం ఆర్బీఐ రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఆ నోట్లు త్వరలో పూర్తిగా చలామణి నుంచి బయటకు వెళ్తాయని, కానీ వాటి లీగల్ టెండర్ కొనసాగుతుందని తాజా అప్‌డేట్‌లో తెలిసింది.

Rs.500Note : రెండు సంవత్సరాల క్రితం ఆర్బీఐ రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఆ నోట్లు త్వరలో పూర్తిగా చలామణి నుంచి బయటకు వెళ్తాయని, కానీ వాటి లీగల్ టెండర్ కొనసాగుతుందని తాజా అప్‌డేట్‌లో తెలిసింది. ఈ నేపథ్యంలో మార్చి 2026 నుంచి రూ.500 నోట్లు చలామణిలో ఉండవని, ఏటీఎంల నుంచి కూడా రావడం మానేస్తాయని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ప్రభుత్వం తరపున పీఐబీ ఈ వార్తపై ఫ్యాక్ట్ చెక్ చేసి, ప్రజల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించింది.

వాట్సాప్‌లో ఒక మెసేజ్ వైరల్ అవుతుంది. అందులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులకు సెప్టెంబర్ 30, 2025 లోపు తమ ఏటీఎంల నుంచి రూ.500 నోట్లు రాకుండా ఆపాలని ఆదేశించినట్లు ఉంది. 75% బ్యాంకులలో ఏటీఎంల నుంచి రూ.500 నోట్లు తొలగించాలని, మార్చి 31, 2026 నాటికి 90% ఏటీఎంల నుంచి ఈ నోట్లు పూర్తిగా తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఏటీఎంల నుంచి కేవలం రూ.100, రూ.200 నోట్లు మాత్రమే లభిస్తాయని, కాబట్టి మీ దగ్గర ఉన్న రూ.500 నోట్లను ఇప్పటి నుంచే ఖర్చు చేయడం మొదలు పెట్టాలని ఆ మెసేజ్ సారాంశం.



పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఈ మెసేజ్‌ను పూర్తిగా తప్పుడుదిగా ప్రకటించింది. పీఐబీ తమ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా, రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదని, రూ.500 నోట్లు ఇప్పటికీ చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని తెలియజేసింది. అంటే, రూ.500 నోట్లను ఎలాంటి సమస్య లేకుండా ఉపయోగించవచ్చు. పీఐబీ ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలకు దూరంగా ఉండాలని సూచించింది. అలాగే, ఏదైనా మెసేజ్ అనుమానాస్పదంగా అనిపిస్తే దానిపై ఫిర్యాదు చేయాలని, తద్వారా తప్పుడు సమాచారం వ్యాపించకుండా ఆపవచ్చని పేర్కొంది. ప్రస్తుతం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ.500 నోట్ల చలామణిపై నిషేధం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నోట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories