PhonePe SBI Card: రెండు కొత్త క్రెడిట్ కార్డులు – కొనుగోళ్లపై 10% వరకు రివార్డ్స్

PhonePe SBI Card: రెండు కొత్త క్రెడిట్ కార్డులు – కొనుగోళ్లపై 10% వరకు రివార్డ్స్
x

PhonePe SBI Card: రెండు కొత్త క్రెడిట్ కార్డులు – కొనుగోళ్లపై 10% వరకు రివార్డ్స్

Highlights

ప్ర‌ముఖ క్రెడిట్ కార్డు సంస్థ ఎస్‌బీఐ కార్డ్ మరియు ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే కలిసి రెండు కొత్త కో-బ్రాండ్ క్రెడిట్ కార్డులను విడుదల చేశాయి. అవి ఫోన్‌పే-ఎస్‌బీఐ సెలెక్ట్ బ్లాక్ (ప్రీమియం కార్డు) మరియు ఫోన్‌పే-ఎస్‌బీఐ పర్పుల్ (సాధారణ కార్డు)

ప్ర‌ముఖ క్రెడిట్ కార్డు సంస్థ ఎస్‌బీఐ కార్డ్ మరియు ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే కలిసి రెండు కొత్త కో-బ్రాండ్ క్రెడిట్ కార్డులను విడుదల చేశాయి. అవి ఫోన్‌పే-ఎస్‌బీఐ సెలెక్ట్ బ్లాక్ (ప్రీమియం కార్డు) మరియు ఫోన్‌పే-ఎస్‌బీఐ పర్పుల్ (సాధారణ కార్డు). ఈ రెండు కార్డులు వీసా మరియు రూపే నెట్‌వర్క్‌లపై పనిచేస్తాయి. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఈ కార్డులను ఎంచుకోవచ్చు.

ఫోన్‌పే-ఎస్‌బీఐ సెలెక్ట్ బ్లాక్ కార్డు ముఖ్యాంశాలు

జాయినింగ్ ఫీజు: ₹1,499 (మొదటి బిల్లు పేమెంట్ తరువాత ₹1,500 ఫోన్‌పే గిఫ్ట్ వోచర్ రీఫండ్)

రెన్యువల్ ఫీజు: రెండో సంవత్సరం నుంచి ₹1,499 (ఏడాదిలో ₹3 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే మాఫీ)

రివార్డ్స్:

ఫోన్‌పే రీఛార్జ్‌లు, బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ మొదలైన వాటిపై 10% రివార్డు పాయింట్లు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, ఉబర్, మింత్రా, బుక్‌మైషో లాంటి ఆన్‌లైన్ కొనుగోళ్లపై 5% రివార్డ్స్

స్కాన్ & పే, ట్యాప్ & పే చెల్లింపులపై 1% రివార్డు పాయింట్లు

ఫ్యూయల్ సర్‌ఛార్జ్ రద్దు

ప్రత్యేక ఆఫర్లు:

ఏడాదిలో ₹5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ₹5,000 ట్రావెల్ వోచర్

దేశీయ విమానాశ్రయాల్లో త్రైమాసికానికి 4 ఉచిత లాంజ్ యాక్సెస్‌లు

అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ₹8,000 విలువైన ప్రైయారిటీ పాస్ ఉచితం

ఫోన్‌పే-ఎస్‌బీఐ పర్పుల్ కార్డు ముఖ్యాంశాలు

జాయినింగ్ ఫీజు: ₹499 (మొదటి బిల్లు పేమెంట్‌పై ₹500 ఫోన్‌పే గిఫ్ట్ వోచర్)

రెన్యువల్ ఫీజు: రెండో సంవత్సరం నుంచి ₹499 (ఏడాదిలో ₹1 లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేస్తే మాఫీ)

రివార్డ్స్:

ఫోన్‌పే రీఛార్జ్‌లు, బిల్ పేమెంట్లపై 3% రివార్డ్స్

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో, ఉబర్, బుక్‌మైషో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై 2% రివార్డ్స్

స్కాన్ & పే, ట్యాప్ & పే చెల్లింపులపై 1% రివార్డ్స్

ఫ్యూయల్ సర్‌ఛార్జ్ రద్దు

ప్రత్యేక ఆఫర్: ఏడాదిలో ₹3 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ₹3,000 ట్రావెల్ వోచర్

గమనిక

ఒక రివార్డు పాయింట్ = ₹1 కు సమానం. ఈ రివార్డులను ఎస్‌బీఐ రివార్డ్స్ పోర్టల్ ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories