EPFO: పీఎఫ్ ఖాతా ఇక మీ 'మినీ బ్యాంక్'.. యూపీఐతో తక్షణమే విత్‌డ్రా!

EPFO:
x

EPFO: పీఎఫ్ ఖాతా ఇక మీ 'మినీ బ్యాంక్'.. యూపీఐతో తక్షణమే విత్‌డ్రా!

Highlights

EPFO: పీఎఫ్ విత్‌డ్రా అంటే ఒకప్పుడు నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగడం, ఇప్పుడు ఆన్‌లైన్‌లో రోజుల తరబడి వేచి చూడటం.. కానీ త్వరలోనే పరిస్థితి పూర్తిగా మారిపోనుంది! మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో, టీ బిల్లు కట్టినంత వేగంగా పీఎఫ్ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్‌లోకి రానున్నాయి

EPFO: పీఎఫ్ విత్‌డ్రా అంటే ఒకప్పుడు నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగడం, ఇప్పుడు ఆన్‌లైన్‌లో రోజుల తరబడి వేచి చూడటం.. కానీ త్వరలోనే పరిస్థితి పూర్తిగా మారిపోనుంది! మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో, టీ బిల్లు కట్టినంత వేగంగా పీఎఫ్ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్‌లోకి రానున్నాయి. మీ అవసరానికి పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే ఇకపై ఫారాలు నింపి, వారాల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. EPFO 3.0 పేరుతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక భారీ అప్‌గ్రేడ్‌కు సిద్ధమైంది. దీని ద్వారా మీ పీఎఫ్ అకౌంట్‌ను కూడా గూగుల్ పే లేదా ఫోన్ పే లాగా చాలా సులభంగా వాడేసుకోవచ్చు.

ఈ కొత్త విధానంలో హైలైట్స్ ఇవే:

కొత్త మొబైల్ యాప్ ద్వారా కేవలం యూపీఐ పిన్ ఎంటర్ చేసి మీ డబ్బును నేరుగా బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేసుకోవచ్చు.ప్రాథమిక సమాచారం ప్రకారం, ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 25,000 వరకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది మీ భవిష్యత్తు అవసరాల కోసం అకౌంట్‌లో కనీసం 25% బ్యాలెన్స్‌ను అలాగే ఉంచి, మిగిలిన మొత్తాన్ని వాడుకునేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం 100 డమ్మీ అకౌంట్లతో టెస్టింగ్ జరుగుతోంది. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ఉంది.

ఈ అత్యాధునిక సదుపాయం ఏప్రిల్ 2026 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రముఖ యూపీఐ ప్లాట్‌ఫామ్‌లతో కూడా ఈ యాప్‌ను అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. పీఎఫ్ ఖాతాను బ్యాంకింగ్ లాగా వాడే వీలు ఉన్నప్పటికీ, ఇది మీ రిటైర్మెంట్ కోసం దాచుకున్న నిధి. అత్యవసరమైతే తప్ప ఈ నిధిని ముట్టుకోకపోవడమే ఆర్థికంగా మంచి నిర్ణయం.

Show Full Article
Print Article
Next Story
More Stories