EPF: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్..హెచ్ఆర్‎తో పనిలేదు.. ఖాతాలను మీరే బదిలీ చేసుకోవచ్చు

EPF: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్..హెచ్ఆర్‎తో పనిలేదు.. ఖాతాలను మీరే బదిలీ చేసుకోవచ్చు
x
Highlights

EPF: ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు ఉద్యోగుల భవిష్య నిధి అకౌంట్ ను కొత్త యాజమాన్యానికి మార్చుకోవడం ఇకపై మరింత సులభం కానుంది. ఈ ఖాతాలపై...

EPF: ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు ఉద్యోగుల భవిష్య నిధి అకౌంట్ ను కొత్త యాజమాన్యానికి మార్చుకోవడం ఇకపై మరింత సులభం కానుంది. ఈ ఖాతాలపై ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ క్రెయిమ్స్ కోసం పాత, కొత్త యాజమాన్యాల మధ్య తిరగాల్సిన అవసరం ఇక నుంచి ఉండదు.

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రకటించిన సంస్కరణల ప్రకారం..ఉద్యోగులు తమంతట తామే కొత్త యాజమాన్యానికి తమ ఈపీఎఫ్ అకౌంట్ ను బదిలీ చేసుకోవచ్చు. ఉద్యోగాలు మారేవారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈపీఎఫ్ అకౌంట్స్ ట్రాన్స్ ఫర్ చేసుకునేందుకు ఛాన్స్ కల్పించేందుకు ఈపీఎఫ్ఓ ఈ చర్యలు తీసుకుంది.

దీంతో పీఎఫ్ ట్రాన్స్ ఫర్ ప్రాసెస్ మరింత మెరుగుపడుతుందని, జాప్యాలు తగ్గుతాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా మెంబర్స్ తమ పీఎఫ్ అకౌంట్స్ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. యాజమాన్యాలపై ఆధారపడాల్సిన అవసరం ఇక నుంచి తగ్గుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories