Petrol: రూ.2కే లీటర్ పెట్రోల్.. ఈ దేశాల్లో ధరలు ఇలా ఎందుకు తక్కువ?

Petrol
x

 Petrol: రూ.2కే లీటర్ పెట్రోల్.. ఈ దేశాల్లో ధరలు ఇలా ఎందుకు తక్కువ?

Highlights

Petrol: ప్రపంచంలోని కొన్ని దేశాల్లో లీటర్ పెట్రోల్ రూ.2–3కే లభిస్తోంది. చమురు ఉత్పత్తి, సబ్సిడీల వల్ల అక్కడ ధరలు తక్కువగా ఉండగా, భారత్‌లో మాత్రం రూ.100 పైగా ఉన్నాయి.

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతం రూ.100కు పైగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశీయంగా వినియోగదారులకు పెద్దగా ఉపశమనం లభించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నాయి.

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రం పెట్రోల్ ధరలు అత్యంత తక్కువగా ఉన్నాయి. లిబియాలో లీటర్ పెట్రోల్ ధర సుమారు 0.024 డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2–3 మధ్య ఉంటుంది. ఇరాన్లో లీటర్ ధర సుమారు 0.029 డాలర్లు, అంటే రూ.2.50 వరకు ఉంటుంది. వెనిజులాలో లీటర్ ధర సుమారు 0.035 డాలర్లు, అంటే రూ.3కు సమానం.

ఇవి చమురు ఉత్పత్తి అధికంగా ఉండటం, ప్రభుత్వ సబ్సిడీల కారణంగా తక్కువ ధరలకు లభిస్తున్నాయి. అదేవిధంగా అంగోలాలో లీటర్ ధర సుమారు రూ.27గా ఉండగా, కువైట్లో సుమారు రూ.28గా కొనసాగుతోంది.

భారత్ ప్రధానంగా ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి సుంకాలు, కేంద్ర–రాష్ట్ర పన్నులు, రవాణా వ్యయాలు వంటి కారణాల వల్ల దేశంలో పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories