మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు.. వారం రోజుల్లో ఆరోసారి పెంపు...

Petrol and Diesel Price Hike 30 Paisa Today 28 03 2022 | Business News
x

మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు.. వారం రోజుల్లో ఆరోసారి పెంపు...

Highlights

Petrol and Diesel Price Hike: పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35పైసలు పెంపు...

Petrol and Diesel Price Hike: దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్ల బాదుడు కొనసాగుతూనే ఉంది. నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోజువారీ ధరల సవరణను పున:ప్రారంభించాయి చమురు సంస్థలు. మార్చి 22 నుంచి ఇప్పటిదాకా వారం రోజుల్లో ఆరు సార్లు చమురు సంస్థలు ధరలను బాదేశాయి. ఈ వారం రోజుల్లో మొత్తం మీద, లీటర్ పెట్రోల్‌పై 4 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 4రూపాయల 10 పైసలు పెంచేశాయి.

తాజాగా ఇవాళ కూడా చమురు సంస్థలు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35పైసలు పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ప్రస్తతం ధరలతో హైదరాబాద్‌లో పెట్రోల్ 112రూపాయల 71పైసలు, డీజిల్ 99రూపాయల 8 పైసలుగా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ 114 రూపాయల 64 పైసలు, డీజిల్ 100రూపాయల 63 పైసలకు పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories