Petrol, Diesel: పెట్రోల్ బంక్‌లో ఇంధనం వేయించుకునే ముందు..ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..లేదంటే నష్టం మీకే

Petrol, Diesel: పెట్రోల్ బంక్‌లో ఇంధనం వేయించుకునే ముందు..ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..లేదంటే నష్టం మీకే
x
Highlights

Petrol, Diesel: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా పెట్రోల్, డీజిల్ కల్తీ కేసులే కనిపిస్తున్నాయి.

Petrol, Diesel: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా పెట్రోల్, డీజిల్ కల్తీ కేసులే కనిపిస్తున్నాయి. శుభ్రమైన మంచి ఇంధనం ఇవ్వకపోవడంతో చాలా వాహనాల ఇంజిన్లు పాడైపోతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. అందుకే పెట్రోల్ బంక్‌లో ఉన్నప్పుడే జాగ్రత్త వహించడం మంచిది.

కల్తీ పెట్రోల్ లేదా డీజిల్ వాహానాలో పడితే ఇంజిన్ పాడైపోయింది. దాని జీవితకాలం తగ్గిపోతుంది. అంతేకాదు వాహనంలోని ఇతర భాగాలపై దీని ప్రభావం పడుతుంది. అందుకే ముందే జాగ్రత్తపడడం చాలా బెటర్. ఎందుకంటే ఇలాంటి కల్తీ ఇంధనం కేసులు ఈ మధ్య భాగా పెరిగిపోయాయి. దీంతో వాహనదారులు ఆంధోళనకు దిగిన ఘటనలు కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. పెట్రోల్ బంక్‌లో సరిగా జాగ్రత్త పడకపోతే వాహానాలు పాడైపోవడమే కాదు భారీగా ఖర్చులు కూడా పెరిగిపోతాయి. అందుకే నిపుణులు ఏమంటున్నారంటే పెట్రోల్, డీజిల్‌ మీ వాహనాల్లో వేసుకునే ముందు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోమని అంటున్నారు.

పెట్రోల్‌ కలిపేవి ఏంటి?

సాధారణంగా పెట్రోల్‌ రేటు ఎక్కువగా ఉంటుంది. దీంతో రకరకాలు కలిపి వాటిని కాస్త తక్కువ రేటుకి బయట అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో తెలియకుండా, గుర్తించలేకుండా కూడా కల్తీ జరిపోతుంది. సాధరాణంగా పెట్రోల్ బంక్‌లో నాఫ్తా అనే ఒక పెట్రోల్ కెమికల్ కలుపుతారు. ఇది చూడడానికి అచ్చం పెట్రోల్‌ లానే ఉంటుంది. అదేవిధంగా కిరోసిన్‌ కూడా కలుపుతారు. దీంతో వాసనను గుర్తించడం కష్టం అవుతుంది. ఇవి కాకపోతే పారిశ్రామిక ఆల్కహాల్ ని కూడా ఈ మధ్య ఎక్కువగా కలుపుతున్నారు. దీనివల్ల ఇంజిన్ పాడైపోతుంది.

డీజిల్‌లో ఏం కలుపుతారు?

సాధరణంగా డీజిల్‌లో కిరోసిన్ కలుపుతారు. దీంతోపాటు తేలికపాటి హైడ్రో కార్బన్లు, పామాయిల్ లేదా విజిటబుల్ అయిల్ వంటి పదార్ధాలను కలుపుతున్నారు. ఇది ఇంజన్‌పై తీవ్ర మైన చెడు ప్రభావం చూపిస్తుంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పెట్రోల్ వేయించుకునేటప్పుడు ప్రది ఒక్కరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎప్పుడూ ఒకే దగ్గర పెట్రోల్ లేదా డీజిల్ వేయించుకోవడం మంచిది. దీనివల్ల వాహనం పాడవకుండా ఉంటుంది. అలాగే ఇంధనం వేసుకునే ముందు మీటర్‌‌ని తనిఖీ చేయాలి. అదేవిధంగా బిల్ తీసుకోకుండా వెళ్లకూడదు.

అదేవిధంగా పెట్రోల్, డీజిల్ సాంద్రతను తనిఖీ చేయాలి. అంటే శుభ్రమైన కంటైనర్‌‌లో ఇంధనం వేసిన తర్వాత అందులో హైడ్రో మీటర వేయాలి. అప్పుడు పెట్రోల్ సాంద్రత 730 –800 మధ్య ఉంటుంది. ఇలా ఉంటే ఈ ఇంధనం స్వచ్చమైనది అని అర్ధం. అదే 730 కంటే తక్కువ అలాగే 800 కంటే ఎక్కువ సాంద్రత ఉంటే అది కల్తీ అని అర్ధం. అదేవిధంగా డీజిల్ విషయానికొస్తే దీని సాంద్రత 830–900 మధ్య ఉండాలి. అలా లేకపోతే అది కల్తీ డీజిల్ అని అర్ధం.

వీటితో పాటు ఎక్కడబడితే అక్కడ పెట్రోల్ డీజిల్ కొనకూడదు. బయట చౌకగా దొరుకుతుందని ఆలోచిస్తే.. ఆ తర్వాత మీ వాహనాల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories