logo
వ్యాపారం

ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలుకు ముందుకు రాని ప్రజలు

ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలుకు ముందుకు రాని ప్రజలు
X
Highlights

కోట్లాది మంది భారతీయులకు అత్యంత సెంటిమెంట్‌ డే ధన త్రయోదశి. ఇవాళ కాస్త బంగారమైనా కొనాలన్నది కోట్లాది మంది భారతీయుల కోరిక. అలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ దేవి ఇంట్లో కొలువై ఉంటుందని నమ్మకం.

కోట్లాది మంది భారతీయులకు అత్యంత సెంటిమెంట్‌ డే ధన త్రయోదశి. ఇవాళ కాస్త బంగారమైనా కొనాలన్నది కోట్లాది మంది భారతీయుల కోరిక. అలా చేస్తే ఏడాదంతా లక్ష్మీ దేవి ఇంట్లో కొలువై ఉంటుందని నమ్మకం. కానీ ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా అధిక శాతం మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా చుక్కలంటిన బంగారం, వెండి ధరల కారణంగా ప్రజలు కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు. దీంతో బంగారు ఆభరణాల దుకాణాలు వెలవెలబోతున్నాయి. గత ఏడాది ధన త్రయోదశితో పోలిస్తే ఈ సంవత్సరం 30 శాతం నగల అమ్మకాలు తగ్గిపోయాయంటున్నారు బంగారు వ్యాపారులు.

Web TitlePeople do not come to buy gold on Dhana Triodashi
Next Story