Passport Problems: ఇవి సరిగ్గా లేకుంటే పాస్‌పోర్ట్‌కు అనర్హులు.. కచ్చితంగా తెలుసుకోండి..!

Passport Cannot Be Obtained If These Documents Are Not Correct Note These Things
x

Passport Problems: ఇవి సరిగ్గా లేకుంటే పాస్‌పోర్ట్‌కు అనర్హులు.. కచ్చితంగా తెలుసుకోండి..!

Highlights

Passport Problems: మనం విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్ట్‌ తీసుకోవాలి. లేదంటే అస్సలు వెళ్లలేరు. పాస్‌పోర్ట్‌ విషయంలోప్రతి దేశానికి కొన్ని నియమాలు ఉంటాయి.

Passport Problems: మనం విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్ట్‌ తీసుకోవాలి. లేదంటే అస్సలు వెళ్లలేరు. పాస్‌పోర్ట్‌ విషయంలోప్రతి దేశానికి కొన్ని నియమాలు ఉంటాయి. అలాగే భారతదేశానికి కూడా కొన్ని పద్దతులు ఉన్నాయి. ఇక్కడ పాస్‌పోర్ట్ పొందడం అంత తేలిక కాదు. దీని కోసం సుదీర్ఘ ప్రక్రియ ద్వారా వెళ్లాలి. పాస్‌పోర్టుకు అప్లై చేసినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

గుర్తింపు కార్డుల్లో పేర్లు వేర్వేరుగా ఉంటే కష్టం

భారతదేశంలో అనేక రకాల గుర్తింపు కార్డులు చెల్లుబాటు అవుతాయి. ఇందులో ఆధార్ కార్, ఓటర్‌ ఐడీ సర్వసాధారణం. అయితే ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఇతర గుర్తింపు కార్డుల్లో వ్యక్తుల పేర్లు భిన్నంగా ఉంటే పాస్‌పోర్ట్‌ పొందడం చాలా కష్టం. ఉదాహరణకు ఆధార్ కార్డులో అనిల్‌ శర్మ అని ఉంటే ఓటరు గుర్తింపు కార్డులో అతని పేరు అనిల్‌ కుమార్‌ శర్మ అని ఉంది. పాస్‌పోర్ట్‌ విషయంలో ఈ రెండు పేర్లను వారు వేర్వేరు వ్యక్తులుగా పరిగణిస్తారు. పాస్‌పోర్ట్‌ రావడం కష్టమవుతుంది.అందుకే అన్ని గుర్తింపు కార్డుల్లో ఒకేపేరు ఉండే విధంగా చూసుకోవాలి.

పుట్టిన తేదీ భిన్నంగా ఉంటే సమస్య

భారత ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన పత్రాలను మాత్రమే పుట్టిన తేదీకి పరిగణలోనికి తీసుకుంటుంది. మీరు ఒకటి కంటే ఎక్కువ డాక్యుమెంట్లు ఇస్తున్నప్పటికీ మీ పుట్టిన తేదీ రెండింటిలోనూ భిన్నంగా ఉంటే సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే చాలా సందర్భాలలో ఆధార్ కార్డులో, ఓటర్ ఐడిలో పుట్టిన తేదీలు వేర్వేరుగాఉంటాయి. దీనివల్ల పాస్‌పోర్ట్‌ రావడం కష్టమవుతుంది.

పోలీసు వెరిఫికేషన్‌

పాస్‌పోర్ట్ తయారీలో పోలీస్ వెరిఫికేషన్ చాలా ముఖ్యం. తరచుగా అద్దె ఇంట్లో నివసించే వ్యక్తులు కొన్ని రోజులకు వేరే చోటికి వెళతారు. కానీ వారి ఆధార్ కార్డులో పాత చిరునామా ఉంటుంది. కానీ అతడు పాస్‌పోర్ట్ పత్రాలపై తన కొత్త చిరునామాను రాస్తాడు. ఈ పరిస్థితుల్లో పోలీసు వెరిఫికేషన్‌లో సమస్య తలెత్తుతుంది. కాబట్టి చిరునామాను ఆధార్ కార్డ్‌లోని ప్రస్తుత చిరునామాతో అప్‌డేట్ చేసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories