భలే మంచి చౌకబేరము

భలే మంచి చౌకబేరము
x
Highlights

ఫ్లిప్ కార్ట్ లో దీపావళి ఆఫర్లు ఇప్పుడు కొనుగోలు దారులను ఆకర్షిస్తున్నాయి. మొబైల్ సేల్ లో భాగంగా రూ.25 వేలు విలువైన స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ.8,639కే అందిస్తుంది.

ఫ్లిప్ కార్ట్ లో దీపావళి ఆఫర్లు ఇప్పుడు కొనుగోలు దారులను ఆకర్షిస్తున్నాయి. మొబైల్ సేల్ లో భాగంగా రూ.25 వేలు విలువైన స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ.8,639కే అందిస్తుంది.

రూ.24,999 ధర గల పానసోనిక్ ఎలూగా ఎక్స్1 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.8,639కే ఫ్లిప్ కార్ట్ లో లభిస్తోంది. సిటీ క్రెడిట్, డెబిట్ కార్డులపై కొనుగోలు చేసేవారికి మరో పది శాతం అదనపు డిస్కౌంట్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ డెబిట్ కార్డులపై కొనుగోలు చేసేవారికి పది శాతం అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఇందులో వున్నాయి. కార్డుల ద్వారా కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ ఫోన్ ను రూ.7,700కే లభిస్తుంది. అంతే కాదండి ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసే వారికి ఐదు శాతం అదనపు తగ్గింపు లభిస్తుంది.

ఇక ఫీచర్స్ విషయానికిస్తే ఇందులో 6.18 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, యాస్పెక్ట్ రేషియో 19:9గా ఉన్న నాచ్ తో కూడిన డిస్ ప్లే ఉంటుంది. స్క్రీన్ రిజల్యూషన్ 1080x2246 పిక్సెల్స్. హీలియో మీడియాటెక్ పీ60 ప్రాసెసర్, 16 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలు ఉన్నాయి. 16 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న ఫ్రెంట్ ఏఐ కెమెరా, వెనకవైపునున్న కెమెరాల్లో సీన్ డిటెక్షన్, బొకే ఎఫెక్ట్, ఆటో ఫోకస్, పనోరమ, నైట్ మోడ్, ప్రొఫెషనల్ మోడ్, 5P లెన్స్ ఎలిమెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా టైమ్ ల్యాప్స్, స్లోమోషన్, హెచ్ డీఆర్, బ్యూటీ షాట్ వంటి ఫీచర్లు కూడా ఈ ఫోనులో వున్నాయి.

4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. మెమొరీ కార్డు ద్వారా 256 జీబీ మైక్రో ఎస్ డీ కార్డు వరకు ఇందులో వేసుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 3000 ఎంఏహెచ్. డుఎల్ సిం సౌకర్యం కలదు. ఈ ఫోన్ పొడవు 15.5 సెంటీమీటర్లు, వెడల్పు 7.55 సెంటీమీటర్లు, మందం 0.78 సెంటీమీటర్లు, బరువు 195 గ్రాములు.

దీంట్లో ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లు కూడా ఉన్నాయి. వైఫై, జీపీఎస్, బ్లూటూత్ 4.2, యూఎస్ బీ సపోర్ట్ ఫీచర్లు, యాక్సెలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియట్ లైట్ సెన్సార్, కంపాస్, గైరోస్కోప్, హాల్ సెన్సార్లను అందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories