Pan Card: పాన్ కార్డు ఎన్ని రోజులు పని చేస్తుంది? పాన్ కార్డ్ పోతే ఏం చేయాలి?

Pan Card
x

Pan Card: పాన్ కార్డు ఎన్ని రోజులు పని చేస్తుంది? పాన్ కార్డ్ పోతే ఏం చేయాలి?

Highlights

Pan Card: చాలామందికి పాన్ కార్డ్ గురించి అంతగా తెలియదు. అసలు పాన్ కార్డ్ ఎందుకు ఇస్తారు? పాన్‌కి ఎన్ని రోజులు పనిచేస్తుంది? అసలు దీనికి ఎక్స్ పైరీ డేట్ ఉంటుందా? ఒకవేళ పాన్ కార్డ్ పోతే ఏం చేయాలి? మరి ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు తెలుసుకుందామా.

Pan Card: చాలామందికి పాన్ కార్డ్ గురించి అంతగా తెలియదు. అసలు పాన్ కార్డ్ ఎందుకు ఇస్తారు? పాన్‌కి ఎన్ని రోజులు పనిచేస్తుంది? అసలు దీనికి ఎక్స్ పైరీ డేట్ ఉంటుందా? ఒకవేళ పాన్ కార్డ్ పోతే ఏం చేయాలి? మరి ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు తెలుసుకుందామా.

పాన్ కార్డు అనేది ఆదాయపు పన్ను శాఖ ద్వారా జారీ చేసే ఒక కార్డు. ఈ కార్డుపై పది అంకెల ప్రత్యేకమైన నెంబర్ ఉంటుంది. ఈ కార్డుని భారతదేశంలో ఉన్న పన్ను చెల్లింపుదారులందరికీ కేటాయిస్తారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ కార్డు ఆర్ధిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ కార్డు లేనిదే ఏ పనీ జరగదు.

బ్యాంకు ఖాతాలకోసం...

బ్యాంకు ఖాతాలు తెరవాలంటే పాన్ కార్డ్ తప్పనసరి. అంతేకాదు రుణాలకోసం ధరఖాస్తు చేసుకోడానికి, క్రెడిట్ కార్డులను పొందడానికి ఎక్కువగా పాన్ కార్డ్ అవసరం. అంతేకాదు ఎటువంటి ఆస్తులు కొనుగోలు చేయాలన్నా కూడా పాన్ కార్డ్ అవసరం ఉంటుంది.

పాప్ కార్డు అనేది ఒక వ్యక్తి లేదా సంస్థకు ప్రత్యేకంగా ఆదాయపు పన్ను శాఖ కేటాయిస్తుంది. పన్ను చెల్లించడానికి మాత్రమే కాకుండా ఆర్ధిక లావాదేవీలన్నింటికీ పాన్ కార్డుని తప్పనసరి చేసింది. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే.. దీనికి డెబిట్, క్రెడిట్ కార్డులులా ఎక్స్ పైరీ డేట్ ఉంటుందా అని? అయితే దీనికి ఎటువంటి ఎక్స్ పైరీ డేట్ ఉండదు. పాన్ కార్డు జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. ఒకసారి పాన్ కార్డ్ జారీ చేస్తే అది జీవితాంతం ఉపయోగించుకోవచ్చు. ఇక ఎప్పటికీ కొత్త కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు.

ఒకవేళ కార్డు పోయినట్లయితే దాన్ని తిరిగి పొందవచ్చు. ముందు డూప్లికేట్ కార్డు కోసం ధరఖాస్తు చేసుకుంటే ఆ తర్వాత ఆ కార్డు అందుతుంది. దీనిపైన ఒక పది నెంబర్ల సంఖ్య్ ఉంటుంది. ఈ నెంబరే చాలా ముఖ్యమైంది. ఈ నెంబర్ డూప్లికేట్ కార్డు వచ్చినా కూడా అదే నెంబర్ ఉంటుంది గానీ మారదు. అంతేకాదు, ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డు మాత్రమే ఉండాలి. ఒక వేళ ఆ వ్యక్తి ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉంటే అది నేరం కిందకు వస్తుంది. ఆ వ్యక్తిని ఆదాయపు పన్ను శాఖలోని సెక్షన్ 272B ప్రకారం సదరు వ్యక్తికి 10వేల రూపాయలు జరిమానా ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే మీ దగ్గర ఎక్కువ పాన్ కార్డులుంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్‌లో సరెండర్ చేయాలి. లేదంటే మీపై ఎప్పుడైనా కేసు పెట్టవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories