OYO: ఓయో పేరు మార్చండి, 3 లక్షలు గెలవండి.. రితేష్ అగర్వాల్ సంచలన ఆఫర్!

OYO
x

OYO: ఓయో పేరు మార్చండి, 3 లక్షలు గెలవండి.. రితేష్ అగర్వాల్ సంచలన ఆఫర్!

Highlights

OYO: బడ్జెట్ హోటల్ చైన్ కంపెనీ ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పేరెంట్ కంపెనీ అయిన ఓరవెల్ స్టేజెస్ (Oravel Stays) కోసం కొత్త పేరు సూచించాల్సిందిగా ప్రజలను ఆహ్వానించారు.

OYO: బడ్జెట్ హోటల్ చైన్ కంపెనీ ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పేరెంట్ కంపెనీ అయిన ఓరవెల్ స్టేజెస్ (Oravel Stays) కోసం కొత్త పేరు సూచించాల్సిందిగా ప్రజలను ఆహ్వానించారు. ఈ వ్యూహాత్మక అడుగు ఇలాంటి సమయంలో పడడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే OYO త్వరలో ఐపీఓ (IPO)కు వెళ్లడానికి సిద్ధమవుతోంది. అలాగే ప్రీమియం సెగ్మెంట్‌లో తమ సేవలను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. కొత్త పేరుతో మార్కెట్లో బలమైన ముద్ర వేయాలనే ఉద్దేశంతో రితేష్ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

చాలా మంది OYO పేరు మారుతుందా అని ఆలోచిస్తుండవచ్చు. కానీ రితేష్ అగర్వాల్ ఒక స్పష్టత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. "మేము మూల కంపెనీ పేరును మాత్రమే మారుస్తున్నాం. హోటల్ చైన్ పేరు కాదు, కన్స్యూమర్ ప్రొడక్ట్ పేరు కాదు. ప్రపంచవ్యాప్తంగా పట్టణ ఆవిష్కరణలు, ఆధునిక జీవన శైలిని పెంపొందించే మూల కంపెనీ పేరు మారుతోంది" అని తెలిపారు. పేరు సూచించి, విజేతగా నిలిచిన వారికి రూ.3 లక్షల నగదు బహుమతితో పాటు, రితేష్ అగర్వాల్‌ను స్వయంగా కలిసే అవకాశాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఈ అవకాశం సోషల్ మీడియాలో (ఎక్స్ ద్వారా) ప్రకటించారు.

కొత్త పేరు ఇలా ఉండాలంటే

* బోల్డ్, సింగిల్-వర్డ్ కార్పొరేట్ పేరు

* గ్లోబల్ అనుభూతిని కలిగించేది

* ఒక సంస్కృతికి లేదా భాషకు పరిమితం కానిది

* టెక్నాలజీ-అగ్రగామి (tech-leading)

* చూపరులను ఆకట్టుకునేది (sharp), కానీ గుర్తుండిపోయేది (memorable) కూడా అయి ఉండాలి.

కొత్త యాప్ ప్లాన్

ఈ వ్యూహానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసిన వర్గాల ప్రకారం..OYO తమ ప్రీమియం హోటల్స్, మిడ్-మార్కెట్ నుంచి ప్రీమియం కంపెనీ-సర్వీసుతో కూడిన హోటల్స్ కోసం ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. ఈ విభాగంలో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వృద్ధి కనిపిస్తోంది. ప్రస్తుతం సెలక్ట్ చేస్తున్న పేరు, ఈ ప్రీమియం హోటల్ యాప్ పేరే అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఐపీఓ ప్లానింగ్!

OYO ఐపీఓకు వెళ్లే ప్రణాళికల్లో భాగంగా, జూన్‌లో ఐదు ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు దాని ప్రధాన వాటాదారు అయిన సాఫ్ట్‌బ్యాంక్ (SoftBank)ను కలవడానికి ఏర్పాట్లు చేసినట్లు వార్తా ఏజెన్సీలకు తెలిసింది. ఈ బ్యాంక్‌లలో సిటీ (Citi), గోల్డ్‌మ్యాన్ శాక్స్ (Goldman Sachs), జెఫరీస్ (Jefferies) వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో పాటు, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ (ICICI Securities), యాక్సిస్ క్యాపిటల్ (Axis Capital) వంటి భారతీయ ఆర్థిక సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories