సీనియర్ సిటిజన్లకి గుడ్‌న్యూస్.. మళ్లీ ఆ డిస్కౌంట్‌ ఇచ్చే అవకాశం..!

Opportunity for the Railways to Renew the concession given to senior citizens on train tickets | Live News
x

సీనియర్ సిటిజన్లకి గుడ్‌న్యూస్.. మళ్లీ ఆ డిస్కౌంట్‌ ఇచ్చే అవకాశం..!

Highlights

Indian Railways: రైలు టిక్కెట్లపై సీనియర్ సిటిజన్లకు లభించే సబ్సిడీల కోసం దేశంలో మరోసారి చర్చ జరుగుతోంది...

Indian Railways: రైలు టిక్కెట్లపై సీనియర్ సిటిజన్లకు లభించే సబ్సిడీల కోసం దేశంలో మరోసారి చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ (Social Justice and Empowerment) రైల్వే శాఖ నుంచి సమాచారం కోరింది. వాస్తవానికి కోవిడ్ -19 నిబంధనలు సడలించడం వల్ల దేశంలో అన్ని కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి. దీంతో సీనియర్ సిటిజన్లకు రైలులో ప్రయాణించే ఛార్జీలలో సబ్సిడీని పునరుద్ధరించాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే రైల్వేలపై భారం పడకుండా సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక నివేదిక ప్రకారం దేశంలో క్లెయిమ్ చేయని ఫండ్‌ 1.25 లక్షల కోట్లకు పైగా ఉంది. ఇప్పటి వరకు సీనియర్ సిటిజన్లకు సంబంధించిన అనేక పథకాలు ఈ ఫండ్ నుంచే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు సంబంధించిన సంస్థల డిమాండ్ దృష్ట్యా సంబంధిత మంత్రిత్వ శాఖ రైల్వేల నుంచి అవసరమైన సమాచారాన్ని కోరింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తన తదుపరి కార్యాచరణ గురించి వెల్లడిస్తుంది.

గత 2 సంవత్సరాల నుంచి ఈ సేవలు లేవు..

కోవిడ్ మహమ్మారి సమయంలో ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉన్న దృష్ట్యా రైల్వేలు సీనియర్ సిటిజన్లకి రైల్వేటికెట్లపై సబ్సిడీ నిలిపివేసింది. అయితే ఈ సదుపాయాన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానిపై స్పష్టత లేదు. ఇప్పుడు సీనియర్ సిటిజన్ల నుంచి ఒత్తిడి పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో సీనియర్ సిటిజన్ల సంఖ్య దాదాపు 14 కోట్లుగా ఉంది. దాదాపు ఏడు కోట్ల మంది సీనియర్ సిటిజన్లు గత రెండేళ్లుగా ఎలాంటి మినహాయింపు లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్నారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల లోక్‌సభలో తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories