
AI Shopping: ఇకపై షాపింగ్ మీ పని కాదు.. ఏఐ చూసుకుంటుంది.!
AI Shopping: ఊహించండి.. మీరు సోఫాలో ప్రశాంతంగా కూర్చుని క్లాడ్, నాకు బిర్యానీ కావాలి, అలాగే ఇంట్లో అయిపోయిన సరుకుల లిస్ట్ ఇదిగో.. ఆర్డర్ చేసేయ్ అని ఒక మాట చెబితే చాలు.
AI Shopping: ఊహించండి.. మీరు సోఫాలో ప్రశాంతంగా కూర్చుని క్లాడ్, నాకు బిర్యానీ కావాలి, అలాగే ఇంట్లో అయిపోయిన సరుకుల లిస్ట్ ఇదిగో.. ఆర్డర్ చేసేయ్ అని ఒక మాట చెబితే చాలు. మీ ఫోన్ తనంతట తానుగా యాప్‌లు ఓపెన్ చేసి, బెస్ట్ డీల్స్ వెతికి, పేమెంట్ కూడా పూర్తి చేసి డెలివరీ వచ్చేలా చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉన్నా, ఇది త్వరలోనే మన ముందుకు రాబోతోంది!
భారతీయ చెల్లింపుల వ్యవస్థలో సంచలనాలు సృష్టిస్తున్న ఎన్‌పీసీఐ, ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్‌తో చేతులు కలిపింది. వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయడానికి, ఇకపై పది రకాల యాప్‌లు వాడాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఏఐ ద్వారానే పనులు పూర్తి చేసేలా ఈ సరికొత్త వ్యవస్థను బుధవారం పరీక్షించారు.
మీరు బిగ్‌బాస్కెట్, జొమాటో లేదా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. ఇలా ఏ ప్లాట్‌ఫామ్ నుంచి అయినా ఆర్డర్ చేయమని ఏఐని కోరవచ్చు.ఆర్డర్ చేయడమే కాదు, క్లాడ్ ఏఐ మీ తరపున యూపీఐ ద్వారా సురక్షితంగా పేమెంట్ కూడా చేస్తుంది.ఏఐ తనంతట తానుగా ఎంత పడితే అంత ఖర్చు చేయకుండా, వినియోగదారులు గరిష్టంగా రూ. 15,000 వరకు లిమిట్ సెట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
సాధారణంగా మనం ఏదైనా కొనాలంటే యాప్‌లు వెతకడం, ధరలు పోల్చడం, అడ్రస్ ఎంచుకోవడం వంటి పనులకు సమయం కేటాయిస్తాం. కానీ ఈ 'ఏఐ షాపింగ్' అందుబాటులోకి వస్తే, కేవలం ఒక మెసేజ్ లేదా వాయిస్ కమాండ్‌తో నిమిషాల్లో పని పూర్తవుతుంది. షాపింగ్‌ను ఇంత సులభతరం చేయడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.. టెక్నాలజీని సామాన్యుడికి మరింత చేరువ చేయడమే. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ టెక్నాలజీ విజయవంతమైతే, మన జీవనశైలిలో మరో భారీ మార్పు రావడం ఖాయం. భవిష్యత్తులో ఆర్డర్ ప్లేస్డ్ బై ఏఐ అనే మాట తరచుగా వినిపించబోతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




