SBI: ఎస్బీఐ కస్టమర్లకి గమనిక.. ఆ తేది తర్వాత ఓపెన్‌ చేసిన ఖాతాదారులకి 2 లక్షల ప్రయోజనం..

note to SBI customers rs 2 lakh to account holders as insurance cover  process
x

SBI: ఎస్బీఐ కస్టమర్లకి గమనిక.. ఆ తేది తర్వాత ఓపెన్‌ చేసిన ఖాతాదారులకి 2 లక్షల ప్రయోజనం..

Highlights

SBI: ఎస్బీఐ కస్టమర్లకి గమనిక.. ఆ తేది తర్వాత ఓపెన్‌ చేసిన ఖాతాదారులకి 2 లక్షల ప్రయోజనం..

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు ఈ విషయం గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రూ.2 లక్షల ప్రయోజనాన్ని ఉచితంగా అందిస్తోంది. మీరు కూడా SBI కస్టమర్ అయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. రూపే డెబిట్ కార్డ్‌లను ఉపయోగించే జన్-ధన్ ఖాతాదారులందరికీ రూ. 2 లక్షల వరకు ఉచిత యాక్సిడెంటల్ కవర్‌ను అందిస్తోంది. దాని ప్రక్రియను తెలుసుకుందాం. ఖాతాదారులు జన్ ధన్ ఖాతా తెరిచే కాలాన్ని బట్టి బీమా మొత్తాన్ని SBI నిర్ణయిస్తుంది. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాని ఆగస్టు 28, 2018 వరకు తెరిచిన కస్టమర్‌లు వారికి జారీ చేసిన రూపే PMJDY కార్డ్‌పై రూ. 1లక్ష వరకు బీమా పొందుతారు. అయితే ఆగస్టు 28, 2018 తర్వాత జారీ చేసిన రూపే కార్డ్‌లపై ప్రమాదవశాత్తూ రూ. 2 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది.

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అనేది బ్యాంకులు, పోస్టాఫీసులు, జాతీయ బ్యాంకులలో జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరిచే పథకం. దీనికింద వినియోగదారులకు అనేక సౌకర్యాలు అందుతాయి. ఏ వ్యక్తి అయినా బ్యాంకుకి వెళ్లి KYC పత్రాలను సమర్పించడం ద్వారా జన్ ధన్ ఖాతాను తెరవవచ్చు. ఇది మాత్రమే కాదు ఎవరైనా తమ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను జన్ ధన్‌గా మార్చుకోవచ్చు. ఇందులో రూపే ఏటీఎం కార్డు అందజేస్తారు. ఈ డెబిట్ కార్డ్ ప్రమాద మరణ బీమా, కొనుగోలు రక్షణ కవర్, అనేక ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.

ప్రమాదం జరిగిన తేదీకి ముంద90 రోజులలోపు ఏదైనా బ్యాంక్‌లో ఆర్థిక లేదా ఆర్థికేతర లావాదేవీని నిర్వహించిన వ్యక్తి బీమాకి అర్హుడవుతాడు. అలాంటప్పుడు మాత్రమే మొత్తం చెల్లిస్తారు. క్లెయిమ్ చేయడానికి ముందుగా క్లెయిమ్ ఫారమ్‌ను పూరించాలి. దీంతోపాటు ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్ లేదా సర్టిఫైడ్ కాపీని జతచేయాలి. FIR అసలు లేదా ధృవీకరించబడిన కాపీని జత చేయాలి. పోస్టుమార్టం రిపోర్టు, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు కూడా ఉండాలి. ఆధార్ కార్డ్ కాపీ, కార్డ్ హోల్డర్ వద్ద రూపే కార్డు ఉందని అఫిడవిట్ ఇవ్వాలి. అన్ని పత్రాలను 90 రోజుల్లోగా సమర్పించాలి. పాస్‌బుక్ కాపీతో పాటు నామినీ పేరు, బ్యాంక్ వివరాలను సమర్పించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories