Indian Railways: ప్రయాణికులకి గమనిక.. రాత్రి 10 గంటల తర్వాత టీటీఈ టికెట్‌ అడగలేరు..!

Note To Railway Passengers TTE Ticket Cannot Be Asked After 10 Pm Know Important Railway Rules
x

Indian Railways: ప్రయాణికులకి గమనిక.. రాత్రి 10 గంటల తర్వాత టీటీఈ టికెట్‌ అడగలేరు..!

Highlights

* రాత్రి 10 గంటల తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న ప్రయాణికుడి టికెట్ చెక్ చేసే హక్కు టీటీఈకి లేదు.

Indian Railways: మీరు తరచుగా రైలులో ప్రయాణిస్తుంటారు. ఈ సమయంలో TTE టిక్కెట్‌ను తనిఖీ చేస్తారు. కానీ రాత్రి 10 గంటల తర్వాత TTE రైలులో టిక్కెట్‌ను తనిఖీ చేయలేరు. ఈ విషయంలో TTE మీకు ఇబ్బంది కలిగిస్తే దానిని తిరస్కరించవచ్చు. రాత్రి 10 గంటల తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న ప్రయాణికుడి టికెట్ చెక్ చేసే హక్కు టీటీఈకి లేదు. భారతీయ రైల్వే నియమాల గురించి తెలుసుకుందాం.

మీరు రైలులో ప్రయాణిస్తుంటే రాత్రి 10 దాటితే, TTE ఉదయం వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు. రాత్రి 10 గంటల తర్వాత ఎవరైనా టీటీఈ మీ రైలు టిక్కెట్‌ను చెక్ చేయడానికి వస్తే నిరభ్యంతరంగా తిరస్కరించవచ్చు. అలాగే రాత్రిపూట రైలు కంపార్ట్‌మెంట్‌లో నైట్‌లైట్‌ మినహా మిగిలినవన్నీ బంద్‌ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రయాణికుల నిద్రకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ఇది చేస్తారు.

మీరు ఒక బృందంతో రైలులో ప్రయాణిస్తున్నట్లయితే రాత్రి 10 గంటల తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడకూడదు. ఎందుకంటే మీ సంభాషణ వల్ల ఇతర ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. రైలులో మీ బెర్త్ దిగువన ఉంటే తోటి ప్రయాణీకుడు నిద్రించడానికి మిడిల్ బెర్త్ తెరవాలనుకుంటే అతనిని ఆపకూడదు. ఎందుకంటే వారు కూడా విశ్రాంతి తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories