Gratuity: ఉద్యోగులకి గమనిక.. గ్రాట్యూటీ పొందాలంటే నిబంధనలు తెలుసా..?

No need to work for 5 years to get gratuity benefit know what are the rules
x

Gratuity: ఉద్యోగులకి గమనిక.. గ్రాట్యూటీ పొందాలంటే నిబంధనలు తెలుసా..?

Highlights

Gratuity: ఉద్యోగులకి గమనిక.. గ్రాట్యూటీ పొందాలంటే నిబంధనలు తెలుసా..?

Gratuity: ఒక ఉద్యోగి ఒక ప్రైవేట్ కంపెనీలో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేస్తే అతనికి గ్రాట్యుటీ సౌకర్యం లభిస్తుంది. ప్రతి నెలా జీతంలో కొంత భాగాన్ని గ్రాట్యుటీగా కట్ చేస్తారు. ఈ నిధులని ఉద్యోగి మరిణించిన సమయంలో లేదా రిటైర్మెంట్‌ తర్వాత అందజేస్తారు. అయితే ఒక వ్యక్తి ఐదేళ్లపాటు కంపెనీలో పనిచేస్తేనే అతనికి గ్రాట్యుటీ ప్రయోజనం లభిస్తుందని అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు. చాలా సార్లు ప్రజలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ సమయంలో గ్రాట్యుటీ ప్రయోజనాన్ని పొందవచ్చు.

మీరు ఏదైనా కంపెనీలో 4 సంవత్సరాల 240 రోజుల కంటే ఎక్కువ కాలం పనిచేసినట్లయితే మీరు గ్రాట్యుటీకి అర్హులవుతారు. 10 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు కలిసి పనిచేసే ప్రతి కంపెనీలో గ్రాట్యుటీ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. గ్రాట్యుటీ ప్రయోజనం పొందడానికి 5 సంవత్సరాలు పని చేయనవసరం లేని ఉద్యోగులు చాలా మందే ఉన్నారు. బొగ్గు గనులలో పనిచేసే వ్యక్తులు లేదా మరేదైనా గనులలో పనిచేసే వ్యక్తులు కేవలం 4 సంవత్సరాల 190 రోజులు పనిచేసిన తర్వాత గ్రాట్యుటీకి అర్హులవుతారు. భూమి కింద ఇలాంటి ప్రమాదకర పనులు చేసే వారికి ప్రత్యేక మినహాయింపు లభిస్తుంది.

కంపెనీలలో గ్రాట్యూటీ పొందాలంటే కచ్చితంగా నాలుగేళ్ల 240 రోజుల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఉద్యోగం మారే ముందు చేసే నోటీస్ పీరియడ్ కూడా లెక్కగడతారు. అంటే ఈ 240 రోజుల్లో రెండు నెలల పాటు నోటీసు పీరియడ్ ఉంటే అది కూడా పరిగణలోకి తీసుకుంటారు. గ్రాట్యుటీ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి సర్వీస్ సమయంలో మరణిస్తే అతని పని దినాలు లెక్కిస్తారు. ఆ ఉద్యోగి కుటుంబానికి గ్రాట్యుటీ ప్రయోజనం అందిస్తారు. ఈ డబ్బు అతని నామినీకి చెల్లిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories