కాబోయే కోడలికి రూ. 640 కోట్ల లగ్జరీ విల్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన నీతా అంబానీ

Nita Ambani Wedding Gift To Radhika Merchant Is Rs 640 Crores Villa In Dubai
x

కాబోయే కోడలికి రూ. 640 కోట్ల లగ్జరీ విల్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన నీతా అంబానీ

Highlights

Anant Ambani: రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌, ఎన్‌ఎంఏసీసీ అధ్యక్షురాలు నీతా అంబానీ తన కాబోయే కొత్త కోడలికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.

Anant Ambani: రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌, ఎన్‌ఎంఏసీసీ అధ్యక్షురాలు నీతా అంబానీ తన కాబోయే కొత్త కోడలికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. దుబాయ్‌లో రూ.640 కోట్ల విల్లాను కానుకగా ఇచ్చేశారు. ఇంత ఖరీదైన విల్లాలో 10 బెడ్‌రూమ్‌లు, కళ్లు చెదిరే ఇంటీరియర్స్, ఇటాలియన్ పాలరాయితో డిజైన్స్, కళాకృతులతో దగదగ మెరిపిసోతుందంట. అయితే, ఈ విల్లాలో స్పెషల్ ఎట్రాక్షన్ మాత్రం 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ అంట. ఇందులో పార్టీలు కూడా నిర్వహించుకోవచ్చన్నమాట.

ప్రేమికులైన అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ 2022లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇటీవలే గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. జులైలో ఏడడుగులతో ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు.

వీరి ఎంగేజ్‌మెంట్‌కు ముఖేష్‌ అంబానీరూ.4.5 కోట్లు విలువైన బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ స్పీడ్ కారును అనంత్‌ అంబానికి కానుకగా ఇచ్చారు. అలాగే నీతా అంబానీ తన సొంత డైమండ్ నక్లెస్ సైతం రాధికాకు బహుమతిగా అందించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories