Nita Ambani:అనంత్-రాధిక వెడ్డింగ్‌ వేడుకలపై విమర్శలు.. నీతా అంబానీ సమాధానం..

Nita Ambani Responds To On Sons Lavish Wedding
x

అనంత్-రాధిక వెడ్డింగ్‌ వేడుకలపై విమర్శలు.. నీతా అంబానీ సమాధానం..

Highlights

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం గత ఏడాది అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. కొన్ని రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుకలపై అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Nita Ambani: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం గత ఏడాది అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి కార్యక్రమాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. కొన్ని రోజుల పాటు జరిగిన పెళ్లి వేడుకలపై అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే సమయంలో పెళ్లి కోసం వేల కోట్లు ఖర్చు చేశారంటూ కొందరు విమర్శలు వ్యక్తం చేశారు. తాజాగా బ్లూమ్ బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విమర్శలపై నీతా అంబానీ స్పందించారు.

ఇంటర్వ్యూలో భాగంగా అనంత్ పెళ్లిని ఆడంబరంగా నిర్వహించారనే విమర్శలు మీకు ఇబ్బందిగా అనిపించాయా..? అని ప్రశ్నించారు. దీనికి నీతా అంబానీ సమాధానం ఇచ్చారు. పిల్లల పెళ్లి విషయంలో ప్రతి తల్లిదండ్రులు తమ బెస్ట్ ఇవ్వాలని అనుకుంటారు. మేము కూడా అదే చేశాం. అనంత్ పెళ్లి మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అని భావిస్తున్నా అని చెప్పారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఒకే వేదికపైకి తీసుకురాగలిగామని అన్నారు. ఈ విషయంలో తాము ఎంతో సంతోషంగా ఉన్నామని వివరించారు.

ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. జులై 2024లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు సార్లు ప్రీవెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఆ తర్వాత సంగీత్, మెహందీ, హల్ది వేడుకలతో పాటు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి ముంబాయిలోని జియో వరల్డ్ సెంటర్ వేదికైంది. వీరి వివాహానికి దేశ విదేశాలకు చెందిన సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు హాజరయ్యారు. దీనిపై అప్పట్లోనే విమర్శలు రాగా అంబానీ దంపతులు స్పందించలేదు. తాజా ఇంటర్వ్యూలో తలెత్తిన ప్రశ్నకు నీతా జవాబుచ్చారు.

ఇదిలా ఉంటే.. నీతా అంబానీ ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించనున్నారు. భారతీయ వ్యాపారం, పాలసీ, సంస్కృతికి సంబంధించి ప్రతిష్టాత్మక వార్షిక జాతీయ సదస్సులో ఆమె మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 15, 16 తేదీల్లో జరగనుంది. ఇందులో దాదాపు వెయ్యి మంది ప్రముఖులు పాల్గొనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories