లాభాల్లో ముగిసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు..

లాభాల్లో ముగిసిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు..
x
Highlights

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి...గ్లోబల్ మార్కెట్ల ప్రతికూలతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కాగా.. ఆరంభ ట్రేడింగ్ లోనే నష్టాలను వీడి లాభాల బాట పట్టాయి.

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి...గ్లోబల్ మార్కెట్ల ప్రతికూలతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం కాగా.. ఆరంభ ట్రేడింగ్ లోనే నష్టాలను వీడి లాభాల బాట పట్టాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 112 పాయింట్లు పుంజుకుని 40,544 వద్దకు చేరగా.. నిఫ్టీ సైతం 23 పాయింట్లు బలపడి 11,896 వద్ద స్థిరపడింది.మరోవైపు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశీ విపణి మల్టీ కమోడిటీ ఎక్సేంజీ లో పదిగ్రాముల బంగారం స్వల్పంగా పెరిగి 50, 708 రూపాయల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్ స్పాట్ మార్కెట్ లో పసిడి ధర 52,540 రూపాయల వద్దకు చేరింది..ఇక దేశంలోని మెట్రో నగరాల్లో ఇంధన ధరలు గత 18 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 84 రూపాయల 25 పైసలు వద్దకు చేరగా.. డీజిల్ ధర లీటర్‌కు 76 రూపాయల 84 పైసలుగా నమోదయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories