Flight Ticket Cancellation Rules 2026: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే 'జీరో' ఛార్జీలు!

Flight Ticket Cancellation Rules 2026
x

Flight Ticket Cancellation Rules 2026: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే 'జీరో' ఛార్జీలు!

Highlights

New DGCA Flight Ticket Cancellation Rules 2026: విమాన టికెట్ రద్దు నిబంధనలను DGCA సవరించింది. బుక్ చేసిన 48 గంటల్లోపు రద్దు చేసుకుంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. మెడికల్ ఎమర్జెన్సీ రీఫండ్స్ మరియు పేరు మార్పులపై కొత్త గైడ్‌లైన్స్.

Flight Ticket Cancellation Rules 2026: విమాన టికెట్ బుక్ చేసిన తర్వాత ప్లాన్ మారితే క్యాన్సిలేషన్ ఛార్జీల రూపంలో వేల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని భయపడే వారికి DGCA ఊరటనిచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం, టికెట్ బుకింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంచుతూ ప్రయాణికులకు పలు వెసులుబాట్లు కల్పించింది.

'లుక్-ఇన్ ఆప్షన్' అంటే ఏమిటి?

విమానయాన సంస్థలు ఇకపై ప్రయాణికులకు 48 గంటల పాటు ‘లుక్-ఇన్ ఆప్షన్’ (Look-in Option) అందించాలి.

ఉచిత రద్దు: టికెట్ బుక్ చేసిన 48 గంటల లోపు దానిని రద్దు చేసుకుంటే ఎటువంటి పెనాల్టీ ఉండదు.

మార్పులు: ప్రయాణ తేదీ లేదా సమయంలో మార్పులు కూడా ఉచితంగా చేసుకోవచ్చు. (గమనిక: కొత్త తేదీలో టికెట్ ధర ఎక్కువగా ఉంటే, ఆ వ్యత్యాసాన్ని మాత్రం ప్రయాణికుడు చెల్లించాలి).

ముఖ్యమైన షరతులు:

ఈ లుక్-ఇన్ ఆప్షన్ అందరికీ వర్తించదు. ప్రయాణ తేదీకి కనీసం కొంత గడువు ఉన్నప్పుడు బుక్ చేసిన టికెట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది:

దేశీయ విమానాలు: ప్రయాణ తేదీకి 7 రోజుల ముందు టికెట్ బుక్ చేసి ఉండాలి.

అంతర్జాతీయ విమానాలు: ప్రయాణ తేదీకి 15 రోజుల ముందు బుక్ చేసిన టికెట్లకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.

పేరులో మార్పులు & రీఫండ్ కాలపరిమితి:

పేరు మార్పు: వెబ్‌సైట్ ద్వారా నేరుగా బుక్ చేసుకున్న వారు 24 గంటల్లోపు పేరులో ఏవైనా తప్పులు ఉంటే ఉచితంగా సవరించుకోవచ్చు.

రీఫండ్: ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసినా, రీఫండ్ బాధ్యత విమానయాన సంస్థలదే. కచ్చితంగా 14 పని దినాల్లోగా డబ్బులు వాపస్ చేయాలి.

మెడికల్ ఎమర్జెన్సీ నిబంధనలు:

అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో టికెట్ రద్దు చేస్తే పూర్తి రీఫండ్ లేదా 'క్రెడిట్ షెల్' (తర్వాత ప్రయాణానికి వాడుకునే వెసులుబాటు) పొందే అవకాశం ఉంది.

♦ ప్రయాణికుడు లేదా అదే PNR నంబర్‌పై ఉన్న కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నట్లయితే ఈ సౌకర్యం లభిస్తుంది.

♦ ఇతర అనారోగ్య కారణాలైతే, DGCA ఎంప్యానెల్డ్ వైద్యుల ధృవీకరణ పత్రం ఆధారంగా రీఫండ్ ఇస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories