Mukesh Ambani: టాప్ 10 సంపన్నుల జాబితా నుంచి ముఖేష్‌ అంబానీ ఔట్‌..!

Mukesh Ambani Out of Top 10 Richest List Gautam Adani at 9th Position
x

Mukesh Ambani: టాప్ 10 సంపన్నుల జాబితా నుంచి ముఖేష్‌ అంబానీ ఔట్‌..!

Highlights

Mukesh Ambani: టాప్ 10 సంపన్నుల జాబితా నుంచి ముఖేష్‌ అంబానీ ఔట్‌..!

Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల జాబితాలో చోటు సంపాదించలేకపోయారు. అదే సమయంలో గౌతమ్ అదానీ విపరీతమైన దూకుడును ప్రదర్శించాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ తొమ్మిదో స్థానానికి చేరుకున్నారు. అగ్రశ్రేణి సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ ఈసారి 11వ స్థానానికి పడిపోయారు. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన ఏకైక వెటరన్ గౌతమ్ అదానీ అద్భుతంగా జంప్ చేసి 9వ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద రాకెట్ వేగంతో పెరుగుతుండడం గమనార్హం. గత రెండు రోజుల్లో ఆయన నికర విలువ 8 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 60 వేల కోట్ల రూపాయలు పెరగడం గమనార్హం. అదానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టడంతో పాటు అమెరికాకు చెందిన లారీ ఎలిసన్‌ను అధిగమించాడు. దీంతో అదానీ గ్రూప్‌లోని అన్ని లిస్టెడ్ కంపెనీల షేర్లు గొప్ప వృద్ధిని చూపుతున్నాయి.

దీని కారణంగా అదానీ నికర విలువ కేవలం ఒక్క రోజులో 3.26 బిలియన్ డాలర్లు పెరిగింది. గతంలో కూడా ఒక్క రోజులో అతని నికర విలువలో $ 4.69 బిలియన్ల బంపర్ పెరుగుదల కనిపించిన సందర్భాలు ఉన్నాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తన జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం అదానీ 108 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోని టాప్ 10 సంపన్నుల జాబితాలో 9వ స్థానానికి చేరుకున్నారు. ఈ సంవత్సరం అతని నికర విలువ $ 31.5 బిలియన్లు పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories