Mutual Fund: 10 వేల పొదుపుతో రూ.29 లక్షల సంపాదన.. పదేళ్లలో మ్యూచువల్ ఫండ్ మ్యాజిక్!

Mutual Fund
x

Mutual Fund: 10 వేల పొదుపుతో రూ.29 లక్షల సంపాదన.. పదేళ్లలో మ్యూచువల్ ఫండ్ మ్యాజిక్!

Highlights

Mutual Fund: ఈ ఫండ్‌లో నెలకు రూ.10 వేల చొప్పున SIP రూపంలో పెట్టుబడి పెట్టిన వారికి పదేళ్లలో ఏకంగా రూ.29 లక్షలకు పైగా రాబడి లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Mutual Fund: తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ మంచి అవకాశంగా మారుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడుల్లో ఈక్విటీ ఆధారిత స్కీమ్‌లు భారీ లాభాలు ఇస్తున్నాయి. అలాంటి స్కీమ్‌లో ఒకటి మిరే అసెట్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్.

ఈ ఫండ్‌లో నెలకు రూ.10 వేల చొప్పున SIP రూపంలో పెట్టుబడి పెట్టిన వారికి పదేళ్లలో ఏకంగా రూ.29 లక్షలకు పైగా రాబడి లభించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఎంత పెట్టుబడి – ఎంత రాబడి?

పదేళ్ల క్రితం ఈ ఫండ్‌లో నెలకు రూ.10,000 SIP ప్రారంభించినట్లయితే మొత్తం పెట్టుబడి రూ.11.90 లక్షలు కాగా, దాని విలువ రూ.29.51 లక్షలకు పెరిగింది. ఇది సగటున వార్షికంగా 17.47 శాతం XIRR రాబడికి సమానం.

అదే విధంగా

7 ఏళ్లలో రూ.10,000 SIP → రూ.16 లక్షలు (18.17% XIRR)

♦ 5 ఏళ్లలో → రూ.8.93 లక్షలు

♦ 3 ఏళ్లలో → రూ.4.59 లక్షలు

♦ లంప్‌సమ్‌గా ఒకేసారి రూ.10,000 పెట్టుబడి పెడితే పదేళ్లలో అది దాదాపు రూ.52,000గా మారింది.

టాక్స్ బెనిఫిట్స్ కూడా

ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ కావడంతో పాత పన్ను విధానం ప్రకారం సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. దీంతో రాబడితో పాటు పన్ను ఆదా కూడా లభిస్తుంది.

ఫండ్ వివరాలు

♦ లాకిన్ పీరియడ్: 3 సంవత్సరాలు

♦ AUM: రూ.27,271 కోట్లు

♦ బెంచ్‌మార్క్: నిఫ్టీ 500 – TRI

♦ ఫండ్ మేనేజర్ & CIO: నీలేష్ సురానా

♦ పెట్టుబడి రకం: ఈక్విటీ & ఈక్విటీ సంబంధిత సాధనాలు

మొత్తంగా చూస్తే, దీర్ఘకాలం పెట్టుబడి పెట్టగలిగే వారికి ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్ మంచి సంపద సృష్టి సాధనంగా మారుతోంది. అయితే మార్కెట్ రిస్క్ ఉన్నందున పెట్టుబడి పెట్టేముందు ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories