Microsoft layoffs: ఉద్యోగులకు మళ్లీ భారీ షాక్ ఇవ్వనున్న మైక్రోసాఫ్ట్..వేలాది ఉద్యోగాలు తొలగింపుకు రంగం సిద్ధం

Microsoft layoffs
x

Microsoft layoffs: ఉద్యోగులకు మళ్లీ భారీ షాక్ ఇవ్వనున్న మైక్రోసాఫ్ట్..వేలాది ఉద్యోగాలు తొలగింపుకు రంగం సిద్ధం

Highlights

Microsoft layoffs: ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ ముఖ్యంగా తన సేల్స్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని వేలాదిమంది ఉద్యోగాలను తొలగించడానికి రంగం సిద్దం చేస్తోంది.

Microsoft layoffs: ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ ముఖ్యంగా తన సేల్స్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని వేలాదిమంది ఉద్యోగాలను తొలగించడానికి రంగం సిద్దం చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న తరుణంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. వివరాల్లోకి వెళితే..

ఐటి రంగంలో తనదైన శైలిలో ముందుకు వెళ్లే కంపెనీ మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్‌ లో ఉద్యోగం చేయాలంటే చాలామందికి ఇష్టం. కానీ ఈ మధ్యకాలంలో ఆ కంపెనీ ఉద్యోగులను తగ్గించుకుంటూ వెళ్లిపోతుంది. ఇప్పటికే మేల నెలలో దాదాపు 6వేల ఉద్యోగాలు తొలగించింది. ఇది జరిగిన కొన్ని వారాలకు 300 మంది ఉధ్యోగులను తొలగించింది. లే ఆఫ్స్ ప్రకటించి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇదే సంవత్సరంలో మూడో అతిపెద్ద ఉద్యోగుల తగ్గింపునుకు కంపెనీ సిద్దం అవుతోంది. ఈ సారి సేల్స్ విభాగం మరియు మార్కెటింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తీసే ఛాన్స్ ఉంది. అయితే ఈవిభాగాల్లో దాదాపు 45వేల మంది వరకు పనిచేస్తున్నారు. అయితే ఇందులో ఎంతమందిని ఆ కంపెనీ ఉద్యోగాల్లోంచి తీస్తుందా? అని ఉద్యోగస్తులు తెగ భయపడిపోతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రతి కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆసక్తి చూపుతుంది. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ లను ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ విభాగంలో ఉద్యోగస్తులు అవసరం పడుతుంది. అందుకే సేల్స్, మార్కెటింగ్ డిపార్ట్ మెంట్‌లో ఉన్న వారిని తీసివేయాలని ఆ కంపెనీ ప్లాన్ చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories