Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్‌ సూచీలు

Market Indices Ended With Marginal Gains
x

Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్‌ సూచీలు

Highlights

Stock Market: సెన్సెక్స్ 79, నిఫ్టీ 36 పాయింట్ల లాభం

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. వరుసగా రెండో రోజూ లాభాల బాటలో పయనించాయి. సెన్సెక్స్ 79 పాయింట్లు లాభపడి 65, 975 వద్ద ముగిసింది. నిఫ్టీ 36పాయింట్లు పెరిగి 19,342 దగ్గర నిలిచింది. స్వల్ప లాభాలతో ట్రేడింగ్ మొదలు పెట్టిన సూచీలు ఆఖరి గంట వరకు అదే ఒరవడిలో కొనసాగాయి. చివరల్లో కాస్త తడబడి తిరిగి పుంజుకుని లాభాలతో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 65,229 వద్ద గరిష్టాన్ని , 64,956 దగ్గర కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 19,377-19,309 మధ్య కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు అనుకూలంగా నిలిచాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.71 వద్ద స్థిరపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories