అక్టోబర్ 1 నుంచి మారనున్న ముఖ్య రూల్స్ ఏటీఎమ్ విత్‌డ్రా నుండి రైలు టికెట్ వరకు అన్ని మార్పులు!

అక్టోబర్ 1 నుంచి మారనున్న ముఖ్య రూల్స్ ఏటీఎమ్ విత్‌డ్రా నుండి రైలు టికెట్ వరకు అన్ని మార్పులు!
x

అక్టోబర్ 1 నుంచి మారనున్న ముఖ్య రూల్స్ ఏటీఎమ్ విత్‌డ్రా నుండి రైలు టికెట్ వరకు అన్ని మార్పులు!

Highlights

అక్టోబర్ 1 నుండి దేశంలో బ్యాంకింగ్, రైల్వే టికెట్ బుకింగ్, పోస్టల్ సేవలు, పెన్షన్ పథకాలలో కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ఇవి సాధారణ ప్రజల దైనందిన జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.

అక్టోబర్ 1 నుండి దేశంలో బ్యాంకింగ్, రైల్వే టికెట్ బుకింగ్, పోస్టల్ సేవలు, పెన్షన్ పథకాలలో కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ఇవి సాధారణ ప్రజల దైనందిన జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.

1. RBI చెక్ క్లియరింగ్ వేగవంతం:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 4 నుంచి చెక్ క్లియరింగ్ విధానాన్ని ఇన్‌స్టాంట్ క్లియరింగ్‌గా మార్చింది. పాత ‘బ్యాచ్ సిస్టమ్’ను రద్దు చేసి, చెక్కులపై తక్షణ చెల్లింపులు అందుబాటులోకి వస్తాయి.

2. IRCTC టికెట్ బుకింగ్ కోసం ఆధార్ తప్పనిసరి:

రైల్వే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో అక్టోబర్ 1 నుంచి ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి. దీని ద్వారా మోసాలు, దుర్వినియోగాలను అరికట్టడంతో టికెటింగ్ వ్యవస్థలో భద్రత పెరుగుతుంది.

3. పెన్షన్ పథకాల & పెట్టుబడులు:

UPS పెన్షన్‌లో ఉన్న ఉద్యోగులు NPSకి మార్చుకునే చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2025.

ప్రభుత్వేతర NPS చందాదారులు ఇకపై 100% పెట్టుబడిని ఈక్విటీలలో పెట్టవచ్చు.

CRA ఫీజులు మార్చబడ్డాయి. అక్టోబర్ 1 నుండి కొత్త రుసుములు వర్తిస్తాయి, పెన్షనర్లకు అదనపు ఛార్జీలు రావచ్చు.

4. ఇండియా పోస్ట్ స్పీడ్ పోస్ట్ రేట్లు పెంపు:

స్పీడ్ పోస్ట్ సేవల రేట్లు పెరుగుతాయి. కస్టమర్లు ఇప్పుడు OTP ఆధారిత డెలివరీను ఎంచుకోవచ్చు, ఇది డెలివరీని సురక్షితంగా చేస్తుంది.

5. బ్యాంకింగ్ ఛార్జీలలో మార్పులు:

S బ్యాంక్: సేలరీ అకౌంట్ ఫీజులు, నగదు లావాదేవీలు, ATM విత్‌డ్రా పరిమితులు, డెబిట్ కార్డు ఛార్జీలు, చెక్ బౌన్స్ జరిమానాలు సవరిస్తోంది.

PNB: లాకర్ అద్దె, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ వైఫల్య ఛార్జీలు, నమోదు ఛార్జీలను పెంచుతోంది.

HDFC బ్యాంక్: ప్రీమియం ఇంపీరియా కస్టమర్ల కోసం కొత్త అర్హత ప్రమాణాలు అమలు.

ఈ మార్పుల కారణంగా వినియోగదారులు తమ బ్యాంకింగ్, రైల్వే ప్రయాణం, పెన్షన్ పెట్టుబడులను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories