Hyd Metro: మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. త్వరలోనే ఛార్జీల మోత

Hyd Metro: మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. త్వరలోనే ఛార్జీల మోత
x
Highlights

Hyd Metro: హైదరాబాద్ ప్రయాణికులకు త్వరలోనే బ్యాడ్ న్యూస్ చెప్పనుంది మెట్రో. అతి త్వరలోనే మెట్రో ఛార్జీలు పెంచేందుకు సిద్ధమవుతోంది. కొంతకాలంగా...

Hyd Metro: హైదరాబాద్ ప్రయాణికులకు త్వరలోనే బ్యాడ్ న్యూస్ చెప్పనుంది మెట్రో. అతి త్వరలోనే మెట్రో ఛార్జీలు పెంచేందుకు సిద్ధమవుతోంది. కొంతకాలంగా ఛార్జీలను పెంచేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ కసరత్తు చేపట్టింది. వరుస నష్టాలను అధిగమించేందుకు ఛార్జీల పెంపు అనేది అనివార్యంగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రూ. 6,500 కోట్ల నష్టాలతో మెట్రో రైళ్లు నడుస్తున్నాయని తెలుస్తోంది.

చాలారోజులుగా ప్రయాణికుల రాకపోకల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. సగటున 5లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా వేసింది. తరచుగా 4.8లక్షల నుంచి 5 లక్షలలోపే ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అటు సిటీ బస్సుల్లోనూ మహాలక్ష్మీ పథకం కింద ఫ్రీగా ప్రయాణ సదుపాయం కల్పించారు. దీంతో చాలా మంది మహిళలు వాటివైపే మొగ్గు చూపిస్తున్నారు. విద్యార్థినులు, ఉద్యోగినులు కూడా మెట్రో నుంచి సిటీబస్సుల వైపు మళ్లినట్లు లెక్కలు చెబుతున్నాయి.

ఎల్బీ నగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం కారిడార్లలో ప్రయాణికుల రద్దీ ఉంది. జేబీఎస్, ఎంజీబీఎస్ మార్గంలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో నష్టాలను ఎదుర్కొనేందుకు ఛార్జీల పెంపు మినహా మరో దారి కనిపించడం లేదని తెలుస్తోంది. 2017 నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి రాగా అప్పటి నుంచి ఛార్జీలు పెంచలేదు. అటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో రెండు నుంచి మూడుసార్లు చార్జీలు పెంచినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని ఛార్జీలు పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేయగా..ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకుని కేసీఆర్ అంగీకరించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో నష్టాలపై ఎప్పటికప్పుడు లెక్కలుచెబుతూ..ఛార్జీల పెంపు కోసం అనుమతి కోరారు. తాజాగా ప్రభుత్వం నుంచి సూత్రప్రాయంగా అనుమతి లభించింది. ఇప్పుడున్న ఛార్జీలపై గరిష్టంగా 20శాతం వరకు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం కనిష్టంగా రూ. 10, గరిష్టంగా రూ. 60 వరకు మెట్రో ఛార్జీలు ఉన్నాయి. 20శాతం పెంచితే రూ. 15 నుంచి 75 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు. మెట్రో ఛార్జీలు ఏ మేరకు పెరగనున్నాయనే అంశంపై కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఛార్జీల పెంపు వల్ల ఇప్పుడున్న నష్టాలను అధిగమించేందుకు కొంత వరకు ఊటర లభిస్తుందని అధికారులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories