LIC IPO: మార్చి 10న ఎల్‌ఐసీ ఐపీఓ ప్రారంభం.. యుద్దం ఎఫెక్ట్‌ ఉంటుందా..?

LIC IPO update will Russia ukraine war have an effect
x

LIC IPO: మార్చి 10న ఎల్‌ఐసీ ఐపీఓ ప్రారంభం.. యుద్దం ఎఫెక్ట్‌ ఉంటుందా..?

Highlights

LIC IPO: మార్చి 10న ఎల్‌ఐసీ ఐపీఓ ప్రారంభం.. యుద్దం ఎఫెక్ట్‌ ఉంటుందా..?

LIC IPO: దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీవో తీసుకొస్తుందన్న విషయం తెలిసిందే. దీనికి ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. మార్కెట్‌ వర్గాల సమాచారం మేరకు మార్చి 10న LIC IPO ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే ఎప్పుడెప్పుడు ఎల్‌ఐసీ ఐపీఓలో పెట్టుబడిపెడదామా అన్నట్లుకస్టమర్లు వేచి చూస్తున్నారు. అయితే మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం జరుగుతుండటంతో మార్కెట్లో చాలా మార్పులు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో LIC IPOపై కూడా యుద్దం ప్రభావం ఉంటుందా అని చాలామంది ఆలోచిస్తున్నారు. అయితే దీనిపై ఎల్‌ఐసీ క్లారిటీ ఇచ్చింది. LIC ఇప్పటికే IPO కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ SEBIకి పత్రాలు సమర్పించింది. త్వరలోనే ఐపీఓ ప్రారంభంకాబోతున్నట్లు సంకేతాలిచ్చింది.

IPO నుంచి రూ. 63,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్‌ఐసి పాలసీ హోల్డర్లు కూడా ఈ ఐపిఓలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో 10 శాతం వారికి రిజర్వ్ చేశారు. అంతేకాకుండా వారికి తగ్గింపు కూడా ఉంటుంది. మార్కెట్లోని సమాచారం ప్రకారం కంపెనీ ఇష్యూ ధర రూ. 2000-2100 మధ్య ఉండవచ్చు. సెబీకి సమర్పించిన ముసాయిదా ప్రకారం ఎల్‌ఐసీ ఇష్యూ పరిమాణం రూ.63,000 కోట్ల వరకు ఉండవచ్చు.

మీరు LIC IPOలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ముందుగా కొన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. PAN, Demat ఖాతాను లింక్ చేసి ఉండాలి. ఈ రెండు పనులను వీలైనంత త్వరగా చేసుకుంటే మంచిది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎల్‌ఐసి పాలసీ హోల్డర్‌లు, కంపెనీ ఉద్యోగుల కోసం షేర్ రిజర్వ్ చేశామని స్పష్టం చేసింది. ఇద్దరికీ LIC ఇష్యూ రాయితీపై కేటాయిస్తుంది. ఇష్యూలో 10 శాతం పాలసీ హోల్డర్లకు రిజర్వ్ చేసింది. LIC పాలసీ ల్యాప్ అయినప్పటికీ మీరు రిజర్వ్ కోటాలో వేలం వేయవచ్చు. ఇది కాకుండా ఎల్‌ఐసి ఉద్యోగులకు 5 శాతం వాటా రిజర్వ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories