
Widow Women Rights: ఆస్తి విషయంలో వితంతు మహిళలకు ఉండే హక్కుల గురించి తెలుసుకోండి..!
Widow Women Rights: సమాజంలో భర్త చనిపోయిన స్త్రీలను చిన్నచూపు చూస్తూ ఉంటారు. అందుకే భారతీయ చట్టం వితంతువులకు అనేక హక్కులు కల్పించింది. కానీ చాలామంది మహిళలకు వీటి గురించి తెలియదు.
Widow Women Rights: సమాజంలో భర్త చనిపోయిన స్త్రీలను చిన్నచూపు చూస్తూ ఉంటారు. అందుకే భారతీయ చట్టం వితంతువులకు అనేక హక్కులు కల్పించింది. కానీ చాలామంది మహిళలకు వీటి గురించి తెలియదు. దీంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. భారత రాజ్యాంగంలో అన్ని వర్గాల వారికి హక్కులు కల్పించారు. ప్రతి ఒక్కరికీ వారి సొంత ప్రాథమిక హక్కులు ఉంటాయి. వీటిని ఎవరూ ఉల్లంఘించలేరు. ఇందుకోసం చట్టాలు రూపొందించారు. మహిళల భద్రత, హక్కుల కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి. వితంతు స్త్రీలకు కూడా ఇలాంటి చట్టపరమైన హక్కులు ఉన్నాయి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.
వితంతు హక్కులు
భర్త చనిపోయిన స్త్రీలను వితంతువు అంటారు. భర్త చనిపోయాక భార్యే అన్ని బాధ్యతలూ చూసుకోవాలి. ఒక్కోసారి కుటుంబం గడవడం కష్టంగా ఉంటుంది. భారతీయ చట్టం ప్రకారం వితంతువులకు అనేక హక్కులు ఇవ్వడానికి ఇదే కారణం. ఏ వితంతు స్త్రీ అయినా సంపాదించకపోతే భర్త ఆస్తి నుంచి మనుగడ సాగించలేకపోతే ఆమె మామగారు పోషణ బాధ్యత తీసుకోవాలి. ఇందుకోసం ఆమె కోర్టులో దావా వేయవచ్చు.
వితంతు స్త్రీకి తన భర్త ఆస్తిపై పూర్తి హక్కులు ఉంటాయి. భర్త మరణానంతరం వారసుల్లో భార్యకు సమాన వాటా ఉంటుంది. వితంతువు రెండో పెళ్లి చేసుకున్నా మొదటి భర్త ఆస్తిపై ఆమెకు హక్కు ఉంటుందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఇది హిందూ వారసత్వ చట్టం ప్రకారం నిర్ణయించారు. వితంతువు వీలునామా రాయకుండా చనిపోతే ఆమె ఆస్తిపై బిడ్డలకు హక్కు ఉంటుంది. ఒక వితంతువు రెండో భర్త నుంచి కూడా ఆస్తిని పొందవచ్చు. ఆమె మరణించిన తర్వాత ఆమె పిల్లలు మొదటి భర్తకు చెందినప్పటికీ ఈ ఆస్తికి అర్హులవుతారు. వితంతువు తన ఆస్తిని ఎవరికైనా బదిలీ చేయవచ్చు అలా చేయడానికి ఆమెకు పూర్తి హక్కు ఉంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




