Ration Card: రేషన్‌కార్డులో పిల్లల పేరును ఈ విధంగా యాడ్‌ చేయండి.. కంప్లీట్ ప్రాసెస్‌ తెలుసుకోండి..!

Know The Complete Process Of Adding A Childs Name In Ration Card
x

Ration Card: రేషన్‌కార్డులో పిల్లల పేరును ఈ విధంగా యాడ్‌ చేయండి.. కంప్లీట్ ప్రాసెస్‌ తెలుసుకోండి..!

Highlights

Ration Card: రేషన్‌కార్డును ప్రభుత్వాలు జారీచేస్తాయి. ఇది చాలా ముఖ్యమైన పత్రం. ఇది పౌరుడి గుర్తింపు, నివాసం రుజువును అందిస్తుంది. బియ్యం, గోధుమలు, చక్కెర, కిరోసిన్ వంటి సబ్సిడీ ఆహార పదార్థాల కోసం రేషన్‌కార్డు కావాలి.

Ration Card: రేషన్‌కార్డును ప్రభుత్వాలు జారీచేస్తాయి. ఇది చాలా ముఖ్యమైన పత్రం. ఇది పౌరుడి గుర్తింపు, నివాసం రుజువును అందిస్తుంది. బియ్యం, గోధుమలు, చక్కెర, కిరోసిన్ వంటి సబ్సిడీ ఆహార పదార్థాల కోసం రేషన్‌కార్డు కావాలి. బ్యాంకు ఖాతా తెరవడానికి, పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, ఇతర ప్రభుత్వ సేవలను పొందేందుకు దీనిని ఉపయోగిస్తారు. రేషన్ కార్డ్ ఉన్నవారికి ఆహార సరుకులలో తగ్గింపు లభిస్తుంది. పేదలకు, తక్కువ ఆదాయం ఉన్నవారికి రేషన్‌కార్డు ఒక వరంలాంటిది.

రేషన్ కార్డు కోసం అప్లై చేయడానికి కావాల్సిన పత్రాలు

1. ఆధార్ కార్డ్

2. నివాస ధృవీకరణ పత్రం

3. కుటుంబ పెద్ద గుర్తింపు రుజువు

4. కుటుంబ ఆదాయ రుజువు

పిల్లల పేరును రేషన్‌కార్డులో యాడ్‌ చేయడం ఎలా..?

మీకు రేషన్ కార్డు లేకపోతే రాష్ట్ర ఆహార శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించి లేదా సమీపంలోని ఆహార శాఖ కార్యాలయాన్ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డులో పిల్లల పేరును యాడ్‌ చేయడానికి ఆన్‌లైన్ అప్లై చేసుకోవాలి.

1.మీ రాష్ట్ర ఆహార శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2. "యాడ్‌ మెంబర్‌" లేదా "రేషన్ కార్డ్‌ యాడ్‌నేమ్‌" వంటి లింక్ కోసం సెర్చ్‌ చేయండి.

3. లింక్‌పై క్లిక్ చేసి అప్లికేషన్‌ ఫారమ్‌ను ఓపెన్ చేయండి.

4. మీ పేరు, రేషన్ కార్డ్ నంబర్, పిల్లలపేరు, పుట్టిన తేదీ, నివాస ధృవీకరణ పత్రం నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ వంటి సమాచారాన్ని నింపండి.

5. మీ అప్లికేషన్‌తో పాటు అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి.

6. అప్లికేషన్ ఫీజు చెల్లించండి.

7. అప్లికేషన్‌ను సమర్పించండి.

దరఖాస్తును సమర్పించిన తర్వాత మీకు అప్లికేషన్ నంబర్ వస్తుంది. దీనిద్వారా అప్లికేషన్‌ స్టేటస్‌ను చెక్‌ చేయవచ్చు. దరఖాస్తు ధృవీకరించిన తర్వాత రేషన్ కార్డుకు పిల్లల పేరు యాడ్‌ అవుతుంది. ఈ ప్రక్రియకు సాధారణంగా 10 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. రేషన్ కార్డులో పిల్లల పేరు చేర్చడానికి రేషన్ కార్డ్, పిల్లల జనన ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ లు అవసరమవుతాయి.రేషన్‌కార్డులో పిల్లల పేరును చేర్చాలంటే తప్పనిసరిగా 18 ఏళ్లలోపు ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories