Home Loan: చౌకైన హౌసింగ్‌ లోన్‌ ఎక్కడ లభిస్తుందో తెలుసా..?

Know about cheap home loan after RBI hikes repo rate
x

Home Loan: చౌకైన హౌసింగ్‌ లోన్‌ ఎక్కడ లభిస్తుందో తెలుసా..?

Highlights

Home Loan: చౌకైన హౌసింగ్‌ లోన్‌ ఎక్కడ లభిస్తుందో తెలుసా..?

Home Loan: రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) సెప్టెంబర్ 30న మరోసారి బ్యాంకు రెపోరేటుని పెంచింది.50 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఈ ఏడాది మే నెల తర్వాత ఆర్బీఐ రెపో రేటును పెంచడం ఇది నాలుగోసారి. మే నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు 190 బేసిస్ పాయింట్లు పెంచారు. దీంతో రెపో రేటు మూడేళ్ల గరిష్ఠ స్థాయి 5.9 శాతానికి చేరింది. రెపో రేటు పెంపుదల ప్రభావం గృహ రుణ వడ్డీ రేట్ల పెరుగుదలలో కనిపిస్తుంది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి చాలా బ్యాంకులు గృహ రుణం చాలా ఖరీదైనవిగా మార్చాయి.

1.కోటక్ మహీంద్రా బ్యాంక్

కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కస్టమర్లకు కనీసం 7.50 శాతం చొప్పున గృహ రుణాన్ని అందిస్తోంది. రుణం మొత్తంలో 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి.

2.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.90 శాతం గృహ రుణ ప్రారంభ రేటును అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు గురించిన సమాచారాన్ని బ్యాంకు శాఖలో తెలుసుకోవాల్సి ఉంటుంది.

3.బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా 7.45% ప్రారంభ రేటుతో గృహ రుణాన్ని అందిస్తోంది. ప్రాసెసింగ్ రుసుము గురించి సమాచారాన్ని పొందడానికి బ్యాంక్ శాఖను సంప్రదించాలి.

4.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు 8.05 శాతం ప్రారంభ రేటుతో గృహ రుణాలను అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు కోసం రుణం మొత్తంలో కనీసం 0.35 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

5.హెచ్‌డిఎఫ్‌సి

హెచ్‌డిఎఫ్‌సి హోమ్ లోన్స్ తన కస్టమర్‌లకు 8.10 శాతం ప్రారంభ రేటుతో రుణాలను అందిస్తోంది. లోన్ మొత్తంలో 0.5% లేదా రూ. 3,000, ఏది ఎక్కువైతే అది ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తారు.

6. LIC హౌసింగ్ ఫైనాన్స్

LIC హౌసింగ్ ఫైనాన్స్ 7.55 శాతం ప్రారంభ రేటుతో గృహ రుణాలను అందిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు కోసం రూ.10,000 నుంచి రూ.15,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories