పండగ వేళ జియో బంపర్‌ ఆఫర్‌..!

పండగ వేళ జియో బంపర్‌ ఆఫర్‌..!
x
Highlights

టెలికాం సంస్థ రిలయన్స్ జియో దసరా, దీపావళి పండుగల సందర్భంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.1500 విలువ చేసే జియో ఫోన్‌ను కేవలం రూ.699కే...

టెలికాం సంస్థ రిలయన్స్ జియో దసరా, దీపావళి పండుగల సందర్భంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.1500 విలువ చేసే జియో ఫోన్‌ను కేవలం రూ.699కే అందించనుంది. దీనికోసం పాత ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాల్సిన పనిలేకుండా నేరుగా రూ.699కే కొత్త ఫోన్‌ను పొందవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు జియో సంస్థ మంగళవారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ ఫోన్‌ను కొన్న వారికి మొదటి 7 రీచార్జిలపై అదనంగా రూ.99 విలువైన మొబైల్ డేటాను జియో ఉచితంగా అందివ్వనుంది. దీంతో ఫోన్ కొనుగోలుపై రూ.800, 7 రీచార్జిల డేటా విలువ రూ.700 కలిపి మొత్తం రూ.1500 ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ దసరా నుంచి దీపావళి వరకు మాత్రమే వర్తిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories