Jio Recharge: జియో సూపర్‌ ప్లాన్.. తక్కువ ధరలో 336 రోజుల వ్యాలిడిటీ..!

Jio 1559 plan Details 336 Days Validity at Low Price
x

Jio Recharge: జియో సూపర్‌ ప్లాన్.. తక్కువ ధరలో 336 రోజుల వ్యాలిడిటీ..!

Highlights

Jio Recharge: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతూ ఉంటుంది. తాజాగా తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ అందించే ప్లాన్‌ను అప్‌డేట్‌ చేసింది.

Jio Recharge: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతూ ఉంటుంది. తాజాగా తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ అందించే ప్లాన్‌ను అప్‌డేట్‌ చేసింది. మీరు జియో కస్టమర్‌ అయితే ఎక్కువగా డేటా వినియోగించనివారు అయితే ఈ ప్లాన్‌ మీకు బాగా సెట్‌ అవుతుంది. తక్కువ ధరలో 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌ గురించి పూర్తి వివరాలు ఈ రోజు తెలుసుకుందాం.

జియో రూ.1559 ప్లాన్ వివరాలు

జియో రూ.1559 రీఛార్జ్ ప్లాన్‌తో మొత్తం 24 GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. దీంతోపాటు ఏదైనా నెట్‌వర్క్‌లో అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. డేటా, వాయిస్ కాలింగ్‌తో పాటు 3600 SMSలు కూడా వస్తాయి. డేటా పరిమితిని చేరుకున్న తర్వాత వేగ పరిమితి 64 Kbpsకి తగ్గిస్తారు. మీరు ఉండే ప్రాంతంలో రిలయన్స్ జియో 5G సేవలు ఉంటే ఈ ప్లాన్‌తో మీకు అపరిమిత 5G డేటా ప్రయోజనం కూడా లభిస్తుంది.

రూ. 1559 ప్రీపెయిడ్ ప్లాన్‌తో మీకు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కి ఉచిత యాక్సెస్ పొందుతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జియో సినిమా సబ్‌స్క్రిప్షన్‌లో ప్రీమియం యాక్సెస్ ఉండదు. మీరు రూ. 1559 రీఛార్జ్ ప్లాన్‌ను కొనుగోలు చేస్తే 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీని ప్రకారం రోజువారీ ఖర్చు రూ.4.64 మాత్రమే అవుతుంది. ఇలాంటి ప్లాన్‌ మరే నెట్‌వర్క్‌లో లేదనే చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories